సహాయానికి ధన్యవాదాలు తెలిపే ఒక అద్భుత పండుగ ఈ థాంక్స్ గివింగ్.
అమెరికాలో పురాతన కాలం నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్న ఒక గొప్ప సంప్రదాయం.
ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో ఈ వేడుకలు జరుగుతాయి.
ఈ ఏడాది నవంబర్ 28 న ఈ పండుగను చేసుకుంటున్నారు. సంవత్సరం పొడవునా కష్టపడిన అలసటను ఈరోజు నుంచి సేద తీర్చుకుని బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు.
చదువు కోసం, ఉద్యోగ కోసం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన బంధుమిత్రులు ఈరోజు కోసం ఎదురు చూస్తూ అంతా కలుసుకుంటారు.
ఈ రోజున ప్రభుత్వం కూడా జాతీయ సెలవు దినంగా పాటించింది.
ఈరోజు నుంచే క్రిస్మస్ వేడుకలు కూడా ప్రారంభం అవుతున్నాయి.
ఇంటిముందు రంగు రంగు విద్యుత్ దీపాలతో, రకరకాల పిండి వంటలతో ఇష్టమైన వైన్ తో బంధు మిత్రుల కోసం ఎదురు చూస్తూ అంటారు.
తెసిసిన వారు, తెలియని వారు అంటూ తేడా లేకుండా అందరితో కలిసిపోయి ఆలింగనం చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటారు.
గతంలో తమకు సహాయం చేసిన బంధు మిత్రులను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
మన తెలుగు నాట సంవత్సరం పొడవునా పొలాల్లో కష్టపడి పంటలు ఇంటికొచ్చిన సందర్భంలో మన తెలుగు నాట సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు.
పొలంలో కూలి చేసి తమ శ్రమను ధారపోసిన కూలీలకు, చుట్టూ ప్రక్క గ్రామాల బీదలకు పొలం దగ్గరే ధాన్యాన్ని, కూరగాయల్ని, డబ్బును పంపిణీ చేస్తారు.
చేసిన సాయానికి కృతజ్ఞత తెలిపే ఒక తత్సంప్రదాయం.
అలాంటిదే ఈ థాంక్స్ గివింగ్ వేడుక.
ఈ రెండు పండుగలలో మనకు స్పష్టంగా కనిపించేది మానవ సంబంధాలు.
కనుమరుగై పోతున్న ప్రేమ ఆప్యాయతలను పంచిపెట్టే ఈ మానవ సంబంధాలను అనుబంధాలను మళ్ళీ ఆకళింపు చేసుకునే అద్భుత వేడుక .
ఈ థాంక్స్ గివింగ్ అనేది ఏ రూపంలో వున్న ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికీ కొనసాగుతూనే వుండాలని కోరుకుందాం.
అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో జర్నలిస్టు గా, ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈ వ్యాసం రాసే అవకాశం నాకు దక్కింది. ఆర్నెల్ల కోసం అమెరికా వచ్చిన నాకు ఈ థాంక్స్ గివింగ్ పండుగ నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది.
ఈ వ్యాసం మీకు కూడా నచ్చుతుందని ఆశీస్తూ ..
మధు వాకిటి 🙏