• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అప్పుడేమో అలా.. ఇప్పుడిలా.. అమ‌ల‌పై చైతు ఫ్యాన్స్ ఆగ్ర‌హం

admin by admin
November 28, 2024
in Movies, Trending
0
0
SHARES
117
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నాగ‌ర్జున వార‌సులిద్ద‌రూ ఒకేసారి పెళ్లికి సిద్ధం కావ‌డంతో అక్కినేని వారింట పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కొన్ని నెల‌ల క్రిత‌మే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో నాగ చైత‌న్య ఎంగేజ్మెంట్ జ‌రిగింది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో చైతు – శోభిత వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఇంత‌లోనే నాగార్జున మ‌రో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. త‌న చిన్న కుమారుడు కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడ‌ని.. చిత్రకారిణి జైనాబ్ ర‌వ్జీతో అఖిల్ కు నిశ్చితార్థం జ‌రిగింద‌ని తెలుపుతూ నాగార్జున కొన్ని ఫోటోలు పంచుకున్నారు.

రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న‌ అఖిల్‌, జైనాబ్ త్వ‌ర‌లోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 2025 స‌మ్మ‌ర్ లో వీరి వెడ్డింగ్ ఉండొచ్చ‌ని అంటున్నారు. అయితే చైతు, అఖిల్ ఒకేసారి పెళ్లికి రెడీ అయ్యార‌ని సంబరపడేలోపే అక్కినేని అమల చేసిన పనికి నాగ చైతన్య అభిమానులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అస‌లేం జ‌రిగిందంటే.. అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ జ‌రిగిన విష‌యాన్ని అమ‌ల కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

`అక్కినేని అఖిల్‌కి జైనాబ్ రావ్జీతో నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించినందుకు నేను మ‌రియు నాగార్జున‌ చాలా సంతోషిస్తున్నాము! జైనాబ్‌ని మా కుటుంబంలోకి స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యువ జంట జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ అఖిల్‌, కాబోయే కోడ‌లి ఫోటోను అమ‌ల ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.

కానీ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ స‌మయంలో మాత్రం అమల ఒక్క‌ పోస్ట్ కూడా పెట్ట‌లేదు. దీంతో ర‌చ్చ మొద‌లైంది. సొంత కొడుకు ఎంగేజ్మెంట్ పై పోస్ట్ పెట్టిన అమల.. సవతి కొడుకు చైతు పట్ల ఎందుకంత‌ వివక్షత చూపుతున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈనాడు అఖిల్, జైనాబ్‌ల‌కు అంద‌రి ఆశీస్సులు కావాల‌ని కోరిన అమ‌ల‌.. ఆనాడు చైతు, శోభిత‌ల కోసం ఎందుకు పోస్ట్ పెట్ట‌లేద‌ని మండిప‌డుతున్నారు.

Tags: akhil akkineniAkkineni Family WeddingsAmalaAmala AkkineniNaga ChaitanyaNaga Chaitanya FansnagarjunaSobhita DhulipalaTelugu NewsTollywoodZainab Ravdjee
Previous Post

‘థాంక్స్ గివింగ్’-ఓ అద్భుత పండుగ!!

Next Post

నాని కి విల‌న్ గా మారుతున్న మోహ‌న్ బాబు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

నాని కి విల‌న్ గా మారుతున్న మోహ‌న్ బాబు

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra