టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 25న విడుదల కాబోతోంది. విజయ్ కూడా పాన్ ఇండియా హీరోగా ఎదిగే రేంజ్ లో పూరీ తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల జోరును విజయ్ పెంచాడు. అనన్యా పాండేతో కలిసి దేశమంతా చుట్టేస్తున్నాడీ రౌడీ హీరో.
ఇటీవల ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, అక్కడి జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ కూడా షాకైంది. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు అనూహ్య స్పందన లభించింది. ఒక మాల్ లో జరిగిన ఈవెంట్లో విజయ్, అనన్యలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇసకేస్తే రాలనంత జనం రావడంతో…గుజరాత్ మొత్తం విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటోంది.
మాల్ మొత్తం జనసంద్రంగా మారింది. ఇక, రౌడీ హీరో విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. గుజరాత్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక తెలుగు హీరోకు నార్త్ ఇండియాలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం చూసిన బాలీవుడ్ బడా హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారట. మరి, ముందు ముందు లైగర్ విడుదలైన తర్వాత మన రౌడీ హీరో ఇంకెంత క్రేజ్ సంపాదించుకుంటాడో వేచి చూడాలి.
Ahmedabad people are crazy for #Liger ????????
Terrific crowd gathered at the VED Arcade Mall to welcome the @TheDeverakonda ????#LigerOnAug25th@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/WKzyKTaeDU
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) August 7, 2022