ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరిపారు. త్వరలోనే తీపికబురు వింటారని వెల్లడించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు.
ఒక్క మాటలో ఈ మొత్తం ఎపిసోడ్‌ను ఆయన తేల్చేశారు. సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మళ్లీ ఆ సమస్యను పరిష్కరించినట్లు సీఎం జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు.
అసలు ఎవరు సినిమా రేట్లు తగ్గించమన్నారు…ఎవరు పెంచమన్నారు@ysjagan ?
మీరే సమస్య ని సృష్టించి మీరే పరిష్కరించిన్నట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకే చెల్లింది..
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం!#గోరంట్ల#FailedCMjagan#JaganMarkDiversionPolitics— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 11, 2022
టికెట్ల ధరలు సహా వివిధ సినిమాలకు ఐదు షోల పరిమితి వివాదం విషయంలో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు అలీ, పోసాని కృష్ణమురళి కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై పలు రకాల విజ్ఞప్తులను ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. వారం లేదా పదిరోజుల్లోనే ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై శుభవార్త అందుతుందని టాలీవుడ్ ప్రముఖులు వెల్లడించారు.
ఈ పరిణామంపై గోరంట్ల స్పందిస్తూ అసలు ఎవరు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించమన్నారు? ఎవరు పెంచమన్నారు వైఎస్ జగన్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించినట్లు డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం మీకే చెల్లింది.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఈ మేరకు #FailedCMjagan, #JaganMarkDiversionPolitics అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్ చేశారు.