స్వతంత్ర్య భారతదేశంలో ఇప్పటివరకు మరే కేంద్ర ప్రభుత్వం అనుసరించని కొత్త విధానాన్ని ఈసారి బడ్జెట్ సందర్భంగా అనురించనున్నారు. దేశ వార్షిక బడ్జెట్ అన్నంతనే భారీ ఎత్తున పుస్తకాలు.. కాగితాల్ని వినియోగించటం ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా.. ఎలాంటిపేపర్.. పుస్తకం లేకుండానే ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో వీలైనంతవరకు పేపర్ వాడకాన్ని తగ్గించటం.. పుస్తకాల రూపంలో సమాచారాన్ని ప్రింట్ చేయటం కంటే కూడా.. డిజిటల్ ఫార్మాట్ లో సిద్ధం చేస్తున్నారు.
కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపంలో 2021-22 కేంద్ర వార్షిక బడ్జెను రూపొందించాలని నిర్ణయించారు. ఈసారి బడ్జెట్ కు మరో ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర భారతావనిలో మొట్టమొదటి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7 % పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ అంచనాలకు తగ్గట్లే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి బడ్జెట్ ఉంటుందన్న మాట రావటం గమనార్హం.
కోవిడ్ పుణ్యమా అని అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేలా ఆర్థికమంత్రి చర్యల్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. మరి..ఈ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
రోటీన్ గా అయితే.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయ.. వ్యయాల పద్దు.. కొత్తగా విధించే పన్నులు.. ఇతర నిర్ణయాలతోకూడిన బడ్జెట్ పద్దుల్ని పెద్ద ఎత్తున పుస్తకాల రూపంలో ప్రింట్ చేస్తారు. ఇప్పుడా పని మొత్తం తప్పింది. కేవలం.. డిజిటల్ రూపంలో సిద్ధం చేసి.. పీడీఎఫ్ లను ఫార్వార్డ్ చేస్తే.. సమాచారం ప్రజలకు వెళ్లనుంది. మరీ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.