ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్…ఎన్నికల్లో వాడటం మొదలయినప్పుడు…ఎంతో ఆసక్తి..ఉత్సాహం..ఓటు వేసినప్పుడు వచ్చే బీప్ శబ్దం..వింటూ వేలికి వేసిన సిరా గుర్తు చూసుకుంటూ…
లక్కపిడతలతో ఆడుకునే పిల్లలకి..ఎగిరే బొమ్మలు ఇస్తే ఎలా పొంగిపోతారో..ఏదో సాధించేసామన్న ఉత్సాహం తో ఎలా ఉప్పొంగి పోతారో అంతకు మించిన సాధకుల్లా ఎన్నికల కేంద్రం నుండి బయటకు వస్తాము.
ఈవీయమ్ ల మీద ఎప్పటి నుండో అనుమానాలు ఉన్నాయి.ఓడిపోయిన వాళ్ళు అలానే అంటారని తోసిపుచ్చేవారు.వాస్తవం కూడా అలాగే ఉండేది మరి…కాని రెండువేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ లో చాలా అనుమానాలు ఉన్నాయి.
ఈవీయమ్ లను మేనేజ్ చెయ్యవచ్చా ..లేదా ..చెయ్యగలరా ..లేదా అన్న మీమాంస పెద్ద అక్కరలేదు.
సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత…కంప్యూటర్లు హాకింగ్ చేస్తున్నారు….ఫోన్లు టాపింగ్ చేస్తున్నారు అనధికారకంగా..ఫిషింగ్ మెసేజ్ ల తో మన బొమ్మ మొత్తం లాగేస్తున్నారు.బేంకుల్లో సొమ్ము లాగేస్తున్నారు..మనకు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తున్నారు.
సైబర్ క్రైమ్ నిరోధం అంటూ ఒక వ్యవస్ద నే ఏర్పాటు చేసారు.ఈవీయమ్ లు మేనేజ్ చెయ్యటం పెద్ద కష్టం కాదు అని అర్దం చేసుకోవాలి.చేసారా ..చెయ్యలేదా అనేది ఒక పెద్ద చర్చ..!
గత ఎన్నికలు జరిగిన తీరు..జరిపిన తీరు అనుమానస్పదం.అయితే …ఈవీయమ్ లను ..కావలసిన విధం గా సెట్ చేసేసుకోకుండా…తర్కానికి అవకాశం ఉండేలా చెయ్యటమే విశేషము.ఎవరు గెలవాలని నిర్దేశించ బడతారో…వారికి ముందు గొప్పగా ప్రచారం కల్పిస్తారు.వారి ప్రత్యర్ది పార్టీకి కులముద్రవేస్తారు.మతం వాడాల్సిన చోట మతము..ప్రాంతం వాడాల్సిన చోట ప్రాంతము ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
స్దానిక మీడియాలోనూ..జాతీయ మీడియాలోనూ విజయావకాశాలు అనుకూలమన్నట్టు ప్రచారం మొదలు పెడతారు.ప్రత్యర్దుల మీద వ్యతిరేకత ఉన్నట్టు చిన్నగా మొదలు పెట్టి ప్రచారం తీవ్రం చేస్తారు.దీనికి సోషల్ మీడియా సహకారం తీసుకుంటారు.వారికి సంబంధించిన పత్రిక ఉంటే ప్రత్యర్దుల మీద దుష్ప్రచారం చేస్తూ..దుమ్మెత్తి పోస్తూ..వాస్తవ సర్క్యులేషన్ కు మించి ముద్రించి..అవసరమైతే ఉచితంగా పడేస్తారు.
ప్రత్యర్ది ప్రతి అడుగు ..ప్రతిమాట..ప్రతి చర్య భూతద్దంలో చూసి..సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేస్తారు.తరువాత ప్రలోభాల పర్వం మొదలవుతుంది..ప్రత్యర్ది పార్టీల నుండి ప్రముఖ నాయకులను నయానో భయానో లాగేసుకుంటారు.అలాగే తటస్దుల ముసుగులోని ప్రత్యర్దుల వ్యతిరేకులను సమీకరించి సమావేశాలు..పెడతారు.ప్రత్యర్ది నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కులసంఘాల మీటింగులు పెడతారు.
చిరకాలంగా ప్రత్యర్దులకి అండగా ఉన్న వర్గాలు వారికి దూరమవుతున్నాయని ఇంకో పక్క ప్రచారం హోరెత్తిస్తారు.ఈ చర్యల తో అప్పటికే ప్రత్యర్ది పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.తరువాత వ్యవస్దలను వాడటం మొదలు పెడతారు.
అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సాధారణ పౌరుడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.అతని ప్రాధమిక హక్కులు కాపాడబడుతుంటాయి..అదే సమయంలో వ్యవస్దలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి చేతిలో ప్రజాస్వామ్యం గాలిలో దీపంలా మిణుకు మిణుకు మంటుంది.
యధేచ్చగా వ్యవస్దలను వాడతారు.ప్రత్యర్ది ని ఎన్నికల కోడ్ ద్వారా…పోలీసు ద్వారా కట్టడి చేయటం జరుగుతుంది.ఇవన్నీ ..చేసినతరువాత కూడా ఎన్నికల్లో డబ్బు మద్యం ..ప్రలోభాలు..దాడులు..ఎత్తులు పై ఎత్తులు అన్నీ వేస్తారు.
ఎన్నికలు ముగుస్తాయి…సర్వేలు..వస్తాయి అనుకూలంగా…ఫలితాలు వెలువడుతాయి…అనుకూలంగా…జనం మాత్రం ముందు షాక్ అవుతారు..తర్వాత తమాయించుకుంటారు.పోటీలో ఉన్న ప్రధాన పార్టీ లకి మినిమమ్ ఓటు బేంకు ఉంటుంది.ప్రచార పటాటోపం కూడా ఉంటుంది కనుక జనం వేసేసుంటారులే అనుకుంటారు.అంతా లాజిజల్ గానే చేస్తారు..ఎక్కడా లాజిక్ మిస్సవదు.
వారు లాజికల్ సెట్టింగ్ ప్రకారం ..ప్రత్యర్దుల మీద వ్యతిరేకత …దూరమైన వర్గాలు..ప్రజావ్యతిరేక నిర్ణయాలంటూ చేసిన దుష్ప్రచారము..ముఖ్య నాయకుల నిష్క్రమణ ఇవన్నీ ఆలోచించి..ప్రత్యర్దులతో సహా…ఓటమి ఒప్పుకుంటారు.
లోపల అనుమానాలు పీడిస్తున్నా నోరు విప్పలేరు.ఓటమి తర్వాత వెంటనే స్వపక్షం లోని కొందరు పార్టీ మారి విమర్శలు మొదలెడతారు.ఆ మైండ్ గేమ్ లో పడి నాయకుడ్ని విమర్శిస్తారు.కాని వీవీ పాట్స్ స్లిప్పులు లెక్కించటానికి అభ్యంతరమెందుకో సరైన కారణం మాత్రం చెప్పరు.ఈవీయమ్ ల మీద ఉన్న అనుమానాలను మాత్రం తొలగించే ప్రయత్నం చెయ్యరు.
ఋజువు దొరికి ఎవరైనా న్యాయస్దానాలను ఆశ్రయిస్తే వారి జీవితకాలం సరిపోతుంది.పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.అపవాదు తొలగించుకోవటానికి జమిలి ఎన్నికలు వచ్చినా ..లేకపోతే సాధారణ ఎన్నికలైనా ..తమ నిజాయితీ నిరూపించుకోవటం కోసం..తమ గెలుపు యంత్రజాలం కాదు..
అని నిరూపించటం కోసమైనా పేపర్ బేలట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని..దేశంలో ఈ డిమాండ్ చేస్తున్న అన్ని పార్టీలతో కలిపి నిర్ణయించాలి.అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీలో ఎందరు మిగులుతారో చూసుకోవాలి.ఎన్ని పార్టీలు స్నేహ హస్తం అందిస్తాయో చూసుకోవాలి.అదుపులో ఉంచుకున్న వ్యస్దలు ఎంత వరకు తమతో ఉంటాయో తేల్చుకోవాలి.ప్రజల అనుమానాలు తొలగించటం ప్రభుత్వాల విధి.రాజకీయ పార్టీల నైతిక బాధ్యత!