రకుల్ పై టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Movies Sep 29, 2020


మిగిలిన వుడ్ లతో పోలిస్తే.. టాలీవుడ్ భిన్నం. కడుపులో కత్తులు దాచుకుంటారే తప్పించి.. బయటకొచ్చి చెలరేగిపోయినట్లుగా మాట్లాడే సంప్రదాయం మొదట్నించి తక్కువే. ఆ మధ్యన ‘‘మా’’ ఇష్యూలోనూ.. శ్రీరెడ్డి ఎపిసోడ్ లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి.. ఎవరూ ఏమీ మాట్లాడరు. కొన్నేళ్ల క్రితం సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులోనూ.. ఒక పద్దతి ప్రకారం చేయాల్సింది చేశారే కానీ.. ఎవరూ ఎవరిని ఏమీ అనకపోవటాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో రోటీన్ కు భిన్నమైన ఉదంతం చోటు చేసుకుంది.

రూల్స్ ను బ్రేక్ చేసేలా.. కొత్త సీనియర్ నటి.. టీడీపీ మహిళ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి కొత్త కలకలానికి కారణమయ్యారు. బాలీవుడ్.. శాండల్ వుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ ఎపిసోడ్ పై ఆమె మాట్లాడారు. సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్న ఆమె.. ఆ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు.

తాజాగా నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో దివ్యవాణి నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి. మిగిలిన రంగాల్లో మాదిరే సినీ రంగంలోనూ డబ్బులున్న వాళ్లదే రాజ్యమన్న ఆమె.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అంటూ ప్రశ్నించి షాకిచ్చారు.

రకుల్ కే వరుస ఆఫర్లు ఎందుకు వస్తున్నాయంటూ.. ప్రణీత లాంటి మంచి అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వటానికి సినీ పెద్దలు ఎందుకు ముందుకు రావటం లేదంటే.. సరికొత్త తేనెతుట్టెను కదిపారు.

Pranitha subhash

రకుల్ కు ఆఫర్లు రావటాన్ని ప్రశ్నిస్తూ.. ప్రణీతకు ముందు ‘మంచి అమ్మాయి’ ట్యాగ్ తగిలించటం ద్వారా.. ఎప్పుడూ లేని సరికొత్త వాతావరణం దివ్యవాణి పుణ్యమా అని చోటు చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీ రంగంలో ఉన్నారని.. వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నట్లు చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి షాకింగ్ గా మారాయని చెప్పక తప్పదు.

ఇప్పటివరకు ఎవరిని ఎవరు పల్లెత్తు మాట అనుకోని విధానానికి భిన్నంగా దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రకంపనలకు కారణమవుతున్నాయని చెప్పక తప్పదు. మరీ.. కొత్త తరహా మాటలు రానున్న రోజుల్లో ఎక్కడి వరకు వెళతాయన్నది చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.