ముందస్తు ఎన్నికలు ఎవరికి నష్టం ఎవరికి కష్టం? ఈ విషయాన్ని పరిశీలిస్తే వైసిపి విధానాల్ని గనుక గమనిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం వైసిపికి పెద్దగా కలిసి వచ్చేలాగా కనిపించడం లేదని వైసీపీలో అంతర్గత సంభాషణల మధ్య నాయకులు సహా పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే వైసిపి ఇప్పటివరకు కూడా నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని నడిపించింది. దీంతో మెజారిటీ ప్రజలు వైసిపి విధానాలను వ్యతిరేకిస్తున్నారనేది అందరికీ తెలిసిందే.
అయితే అభివృద్ధి అనేటటువంటిది కనీసం వచ్చే 9 నెలల్లో అయినా ముందుకు నడిపించగలిగితే ఆ దిశగా అడుగులు వేయగలిగితే వైసీపీకి ఎంతో ఎంతో కలిసివచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాలను రాష్ట్రంలో వైసిపి 151 స్థానాల్లో గత ఎన్నికల్లో గెలిచింది.
ఇప్పుడున్నట్టుగానే ఎన్నికలకు వెళ్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదని అంచనా ఉంది. అదే సమ యంలో టిడిపి జనసేన వంటి పార్టీలు కలిస్తే ఈ ప్రభావం మరింత తగ్గుతుందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే కన్నా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని మెజారిటీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను ఎక్కువమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి అని మరికొందరు సూచిస్తున్నారు.
ఏదేమైనా ముందస్తుకు వెళ్లడం వైసిపికి ఎంత చూసినా కలిసి వచ్చేలాగా కనిపించడం లేదు అనేది పరిశీలకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే కనక జరిగితే అప్పటికి ఎంతో ఎంతో అభివృద్ధి చేశాము అని చెప్పుకునేందుకు కొన్ని పనులైనా కనిపిస్తాయి. అలా కాకుండా ఇప్పటికిప్పుడు డిసెంబర్ నాటికి ఎన్నికలకు వెళ్లడం వల్ల వైసీపీకి ఒరిగేది పెద్దగా ఏమీ ఉండదని అభిప్రాయపడుతు న్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. పైగా ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా కనిపిస్తుండడం చర్చకు దారితీస్తోంది.