దాదాపు రెండు వారాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాష్ ఫ్యామిలీ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు, టర్నింగ్లతో దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీ ముందుకు సాగుతుందే తప్ప ఎటూ తేలడం లేదు. గత 11 రోజులుగా వాణీ మరియు ఆమె ఇద్దరు కూతుళ్లు టెక్కలి లోని దువ్వాడ ఇంటి ముందున్న గ్యారేజీలో నిరసన తెలుపుతున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీను ఆ ఇంటి నుంచి బయట కాలు కూడా పెట్టడం లేదు.
రాజకీయాలు, ఆస్తులు తనకు అక్కర్లేదని.. తమను ఇంట్లోకి రానిస్తే చాలంటున్నారు వాణీ. కూతుళ్లు భవిష్యత్ కోసం, సమాజం కోసం అందరం కలిసుండాలన్నదే తన కోరిక అని ఆమె తెలిపారు. అయితే ఆ ఒక్కటీ తప్పా దేనికైనా రెడీ అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. వాణీతో కలిసి ఉండే ప్రసక్తే లేదని.. ఆమెకు విడాకులు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. వాణీ రోజుకోరకంగా మాట్లాడుతుందని.. రాజకీయంగా తనను పతనం చేయాలన్నదే ఆమె ఉద్దేశమని మండిపడ్డారు.
తండ్రిగా బాధ్యత నిర్వహిస్తానని.. నా కూతుళ్ల పేరు మీద రూ. 29 కోట్లు విలువ చేసే ఆస్తులు రాయడానికి సిద్ధంగా ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆల్రెడీ వాణీకి ఓ ఇంటిని ఇచ్చానని.. దాన్ని వాడుకోవాలని.. నా కొత్త ఇంటి జోలికి వస్తే మాత్రం ఊరుకోనని శ్రీనివాస్ అంటున్నారు. ఇక వీరి ఫ్యామిలీ డ్రామాలో కీలక సూత్రదారి అయిన దివ్వెల మాధురి గత రెండు రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్న పోస్టులు హీటు పుట్టిస్తున్నాయి.
`నువ్వు అన్న ఆలోచన లేని క్షణమే లేదు.. ఇష్టం అనుకున్న, వ్యసనంలా మారిపోయావు.. నాకు ఉన్న ఒకే ఒక్క డ్రీమ్ చివరి వరకు నీతో తోడుగా ఉండాలని, నిన్ను హ్యాపీగా చూసుకోవాలని` అంటూ మాధురి ఇన్స్టా రీల్స్ షేర్ చేస్తుంది. దీంతో ఆమె పోస్టులు దువ్వాడను ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇక తాజాగా మాధురి మరో వీడియో పోస్ట్ చేసింది. యాక్సిడెంట్ తో అయిన బ్లడ్ క్లాట్ మళ్లీ ఇబ్బంది పెడుతోందని.. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని మాధురి వీడియోలో చెప్పుకొచ్చింది. 10 రోజుల తర్వాత మళ్లీ లైవ్ ద్వారా అందరి ముందుకు వస్తానని ఆమె పేర్కొంది.
View this post on Instagram