ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో గత నాలుగు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ లేడీ డాక్టర్ తో క్రిష్ వివాహం జరగనుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు క్రిష్ స్పందించలేదు.. అలానే ఖండించనూ లేదు. ఇక ఇదే తరుణంలో డైరెక్టర్ క్రిష్ కు కాబోయే భార్య ఈమెనే అంటూ ఓ యువతి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె పేరు ప్రీతి చల్లా. హైదరాబాద్ లో గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తోంది. నవంబర్ 10వ తేదీ అంటే రేపు క్రిష్, ప్రీతి మూడు ముళ్లబంధంతో ఒకటి కాబోతున్నారని.. నవంబర్ 16న కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులతో రిసెప్షన్ వేడుక జరగనుందని బలంగా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ.. సోషల్ మీడియాలో సదరు డాక్టర్ ఫోటో మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
కాగా, 2016లో రమ్య అనే యువతిని క్రిష్ ముందుగా వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. కానీ క్రిష్, రమ్యల దాంపత్య జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. పెళ్లైన రెండేళ్లకే ఇద్దరి మధ్య మస్పర్థలు తలెత్తాయి. 2021లో చట్టబద్దంగా ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.