మనకు తెలిసిన, మనకోసం మన సంతోషం కోసం జీవితాన్ని ధారపోసిన మహానుభావులను స్మరించుకోవడం మంచి వాళ్ల లక్షణం. దేశం గర్వించే గాయకుల్లో ఒకరైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని వీడటం ఎంతో మందికి బాధను కలిగించడమే కాదు, వ్యధను మిగిల్చింది. ఆయనను మనం ఎన్నటికీ మరిచిపోలేమన్నది సత్యం. కానీ ఆయన కు మనం చేయగిలిగింది కూడా చేయాలి. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ఒక ఆసక్తికరమైన డిమాండ్ అందరినీ ఆకట్టుకుంటోంది.ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాస్తూ… గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివ్యస్మృతికి నివాళిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగీత విశ్వవిద్యాలయానని ఏర్పాటుచేయాలని తన లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వ సంగీత అకాడెమీకి బాలసుబ్రమణ్యం పేరు పెట్టాలని కూడా చంద్రబాబు కోరారు. అలాగే ఎస్పీ బాలు పేరిట ఒక జాతీయ పురస్కారం ఏర్పాటుచేసి సంగీతంలో సేవకులను ప్రోత్సహించాలన్నారు.
ఇదిలా ఉండగా… ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం బాలుని సత్కరించింది. కానీ ఆయన భారతరత్నకు ఏ మాత్రం తీసిపోరు. భారతరత్న అవార్డు అందుకోదగగిన అన్ని అర్హతలు బాలుకు ఉన్నాయి. లతామంగేష్కర్ కి ఏ అర్హతల మీదయితే భారతరత్న ఇచ్చారో అవే అర్హతలు బాలుకున్నాయి. దక్షిణాది వ్యక్తి అని నిర్లక్ష్యం చేయకుండా ఆయన సేవలకు తగినట్లు భారతరత్న అందజేయాలని ఎస్పీబీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.