జడ్జి రామకృష్ణ తమ్ముడిపై సంచలన దాడి

Andhra Sep 27, 2020

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై హత్యాయత్నం జరిగింది. బి.కొత్తకోట మెయిన్‌రోడ్‌లో సరుకులు తీసుకోవడానికి వచ్చిన సమయంలో సడెన్ కారులో వచ్చిన దుండగులు రామచంద్రపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉంది. సుమారు ఐదుగురు అనామక వ్యక్తులు ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారు.  వారి ప్రయత్నం ఫలించలేదు. వారి దాడి నుంచి రామచంద్ర తప్పించుకున్నారు. అయితే, ఈ క్రమంలో అతను  తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిలో రామచంద్రకు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దుండగులు ఈ దాడికి  ప్రయత్నించినట్లు  బాధితుడు తరఫు వారు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, దర్యాప్తు లో వాస్తవాలు బయటకు వస్తాయోమో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.