నందమూరి కుటుంబానికి బీజేపీలో కీలక పదవి

Andhra Sep 27, 2020

తెలుగు ప్రజలకు బీజేపీ షాకిచ్చింది. ఇది కేవలం షాక్ కాదురాబోయే కాలంలో తెలుగునేలపై బీజేపీ ఎలాంటి ఆశలు పెట్టుకుందో చెప్పకనే చెప్పింది.తెలుగు నేలపై కీలక మహిళలకు పెద్దపదవులు ఇచ్చింది.
బీజేపీ తాజా నిర్ణయాలు ఇంతకాలం బీజేపీ స్థానిక నేతలను బుట్టలో వేసుకుని విర్రవీగిన వైసీపీ పార్టీని కలవరానికి గురిచేసింది. జగన్ తో అత్యంత సాన్నిహిత్యం కలిగిన, ఏ నాడు జగన్ ను విమర్శించిన జీవీఎల్ వల్ల బీజేపీకి ఏపీలో ఎంతో నష్టం జరిగిందని గుర్తించిన పార్టీ అతన్ని పీకేయడం అత్యంత కీలక పరిణామం. మరోవైపు నందమూరి కుటుంబానికి బీజేపీ జాతీయ పదవుల్లో కీలక పదవిని కట్టబెట్టడం అసాధారణ విషయం.రాంమాధవ్ వంటి బీజేపీ కీ లీడర్లు నిర్వహించిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని నందమూరి ఆడబిడ్డ పురంధేశ్వరికి కట్టబెట్టింది బీజేపీ. ఇటీవలే ఆ కుటుంబాన్ని వైసీపీ నుంచి తరిమేసిన జగన్ కి ఇది పెద్ద షాక్. తాజా నిర్ణయంతో నందమూరి అభిమానులు ... వైసీపీ వాళ్లను చూసి మీకు పదవులు వస్తుంటాయి పోతుంటాయ్. నందమూరి కుటుంబానికి పదవులు వైఫైలా తిరుగుతుంటాయని కాలరెగరేస్తున్నారు. బీజేపీలో పదవులు రావడం వేరు. ఐదారేళ్ల క్రితం బీజేపీలో చేరిన పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం వేరు. పురంధేశ్వరి కుటుంబానికి పెద్ద పదవి ఇవ్వడం ద్వారా అటు కాపులను, ఇటు కమ్మలను తన వలలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ ... రఘురామరాజు ద్వారా రాజులను దువ్వుతోంది. బీజేపీ అండ ఉంది కాబట్టే ఆయన ఏపీలో హీరో అయ్యారు. ఈ మార్పులు చూస్తుంటే ఏపీలో బీజేపీ పెద్ద టార్గెట్ నే పెట్టుకుంది.ఇక తెలంగాణలోను సత్యకుమార్ ను జాతీయ కార్యదర్శిగా, డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షరాలిగా నియమించి తెలంగాణలో బీజేపీని 2024 సీఎం పదవి వైపు నడిపించే ప్రయత్నం చేస్తోంది పార్టీ. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ తెలుగు రాష్ట్రాలపై దృష్టిపెట్టింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.