ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమి తరపున నిలబడిన నేతలకే విజయం కట్టబెట్టారు. అది కూడా భారీ మెజారిటీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎక్స్ ఖాతా వేదికగా వారిని అభినందించారు.
`ఈరోజు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ణయాత్మక విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, పేరాబత్తుల రాజశేఖరం గారిని ఏపీ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఈ ఫలితాలు మా ప్రజానుకూల విధానాలు మరియు కుటమి ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసంపై స్పష్టమైన రెఫరెండంలా ఉపయోగపడతాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలిద్దరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ ఎన్నికల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన మా కార్యకర్తలను, నాయకులను, ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడు గారికి నా అభినందనలు` అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
అయితే బాబు ట్వీట్ గా ప్రధాని మోదీ తెలుగులో రిప్లై ఇవ్వడం ప్రాధాన్యత సంతరించింది. చంద్రబాబు ట్వీట్ ను రీట్వీట్ చేసిన మోదీ..`విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి.` అని పేర్కొన్నారు.
పీఎం పోస్ట్ పై చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. `ప్రధాని శ్రీ నరేంద్రమోదీగారికి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీఏ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను.` అంటూ బాబు ఎక్స్ ద్వారా మరో పోస్ట్ పెట్టారు.
విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. https://t.co/PYDKFgT20A
— Narendra Modi (@narendramodi) March 6, 2025