వైసీపీ హయాంలో కొన్ని కొన్నివిషయాలకు సంబంధించి జగన్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దీనిని ఆయనను వ్యతిరకించేవా రు కూడా.. కాదనలేక పోయారు. దీనిలో కీలకమైంది.. `నవరత్నాలు-పేదలంద రికీ ఇళ్లు` పథకం. అప్పటి వరకు అంటే.. 2019 ముందు వరకు రాష్ట్రంలో ప్రభుత్వాలు పేదలకు గ్రూప్ హౌస్‌లు కట్టించి ఇచ్చాయి. టిడ్కో ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ఏవి తీసుకున్నా.. గ్రూప్ హౌస్లే ఇచ్చారు. కానీ, తొలిసారి.. భూములు ఇచ్చి.. ఇండివిడ్యువల్‌గా ఇళ్లు నిర్మించే పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలోనే ఆయన పట్టణాల్లోని పేదలకు సెంటు భూమి చొప్పున ఇచ్చారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి.. సెంటున్నర చొప్పున స్థలాలు కేటాయించారు. వీటిలో కొన్నింటిని నిర్మించారు కూడా. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. జగన్ హయాంలో 30 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 20 లక్షల మందికి భూములు సెంటు, సెంటున్నర చొప్పున కేటాయించారు. వీటిలో 9.5 లక్షల మందికి కట్టించి ఇచ్చేశారు. మిగిలినవి నిర్మాణాల్లో ఉన్నాయి.
మరో పది లక్షల మందికి హక్కు పత్రాలు ఇచ్చారు. కానీ, స్థలాలు ఇవ్వలేదు. ఇదీ ఇప్పటి వరకు జరిగింది. దీంతో ఎన్నికల సమయంలో దీనిని పెద్ద ఎత్తున జగన్ ప్రచారం చేసుకున్నారు. నేను కాబట్టి.. పేదలకు స్థలాలు ఇచ్చానని అన్నారు. ఇకమీదట ఎవరూ ఇవ్వలేరని.. తనలాగా ఎవరూ చేయలేరని కూడా చెప్పారు. దీంతో జగన్ ముద్రను చెరపడం కష్టమని అందరూ అనుకు న్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ఈ ముద్ర తొలగించేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పేదలకు ఇళ్లు పేరుతో ఇప్పుడు చంద్రబాబు జగన్‌ను మించి.. అన్నట్టుగా.. భూములు కేటాయింపునకు రంగం రెడీ చేసుకున్నా రు. పట్టణాల్లోని పేదలకు 2 సెంట్లు(జగన్ ఇచ్చింది సెంటు), పల్లెల్లోని వారికి మూడు సెంట్లు(జగన్ ఇచ్చింది సెంటున్నర) ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇది… జగన్‌కు ఉన్నపేరునే పూర్తిగా తుడిచేస్తుందని టీడీపీనాయకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు గత జగన్ హయాంలో ఈ పథకం కింద ఎంపికైన వారు.. ఇప్పుడు ఆ ఇళ్లు తమకు వద్దని.. చెబుతూ.. ప్రజాదర్బార్‌లో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.