కరోనా వస్తుందేమో అన్న భయం ఒకరకం
వచ్చాక మనకు ఏమవుతుందో అన్న భయం ఇంకో రకం.
వెరసి భయంతో రోగం సగం పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో కరోనా వచ్చాక భయపడాల్సిన అవసరం లేకుండా ఒక కొత్త మందు వచ్చింది.
కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ వ్యవహారం. 60 వేలట దీని రేటు.
అయితే మనం ప్రస్తుతం పెడుతున్న ఖర్చుతో పోల్చి చూస్తే ఇది తక్కువే అనుకోండి.
దీన్ని యాంటీబాడీ కాక్ టెయిల్ అంటారట. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా కలిసి తయారుచేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ మందునే వాడారట.
ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల సంయుక్త మిశ్రమం ఈ మందు. మనదేశంలో 120 ఎంజీ ( ఒక డోసు) యాంటీబాడీ కాక్ టెయిల్ ను రూ.59,750 కి అమ్ముతున్నారు.
ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వాడొచ్చట.
తక్కువ లేదా ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు.
ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 99 శాతం ఉండకపోవచ్చంటున్నారు కంపెనీ వాళ్లు.