ఏపీ సీఎం జగన్ విషయంలో జనసేనాని పవన్ వైఖరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏపీకి వచ్చినా.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, పార్టీని నిలబెట్టుకునేందుకు కూడా జగన్ ప్రభుత్వ లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుంటానని పవన్ చెబుతున్నారు.
ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ పవన్.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హిందువులకు, హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్.. రాష్ట్రాన్ని ఓ మందిరం చేయాలని చూస్తున్నారంటూ.. విమర్శలు గుప్పించారు.
అయితే..అప్పటి నుంచి కరోనా ప్రభావంతో పవన్ జనాల్లోకి రావడం లేదు. ఇదిలావుంటే.. జగన్‌పై పవన్ ఓ రేంజ్లో విరుచుకు పడుతుంటే.. మరోవైపు ఆయన అన్నయ్య, మేగాస్టార్ చిరంజీవి మాత్రం.. జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఏం సందర్భం వచ్చినా.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
తాజాగా.. `జగన్ విజన్ సూపర్“ అంటూ తన ట్విట్టర్లో జనగ్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. భారీ ఎత్తున జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. “జగన్ విజన్ సూపర్. ఒకేరోజు 13 లక్షలపైచిలుకు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. నా అభినందనలు. ప్రజలకు మరిన్ని మంచిపనులు చేయాలని కోరుతున్నా“ అంటూ.. చిరు ట్వీట్ చేశారు.
అంతకు ముందే చిరు సతీ సమేతంగా జగన్ ఇంటికి వెళ్లి మరీ లంచ్ చేసి వచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా ప్రశంసలు మామూలుగా లేవు. మరి అన్నయ్య ఇలా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సరే. మరి.. పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై ఏమంటారు? ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో టీడీపీ విమర్శలు గుప్పించింది.
ప్రజలకు ఏ రోజు కు ఆరోజు వేయాల్సిన వ్యాక్సిన్‌ను నిలిపివేసి.. ఒకే రోజు ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ ఇచ్చి.. దీనినే రికార్డ్ అని చూపించుకునేందుకు సిగ్గు పడాలి! అని టీడీపీ నేతలు ఫైరయ్యారు.
ఈ క్రమంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారు ? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఒకవేళ ఇప్పుడు టీడీపీ మాదిరిగా పవన్ వ్యాఖ్యలు చేసినా.. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి కామెంట్లు కుమ్మరించినా.. ప్రయోజనం లేదని.. ఎందుకంటే.. చిరంజీవి జగన్‌ను పొగిడిన తర్వాత.. పవన్ విమర్శించి కూడా లాభం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి చిరు చేసిన ఒక్క చిన్న ట్వీట్ పవన్‌కు శాపంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.