• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ పై బ్యాటింగ్ కు ముహుర్తం పెట్టిన చంద్రబాబు

మ‌హిళ‌ల‌కు ల‌క్షా 50 వేల జ‌గ‌న‌న్న ఎగ‌నామంపై  బాబు ఫైర్‌

admin by admin
June 22, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
600
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్ర‌బాబు డేట్ ఫిక్స్ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న `తొండి` వైఖ‌రిపై ఉద్య‌మించేందుకు ఈ నెల 29న పార్టీ నేత‌ల‌ను, శ్రేణుల‌ను ఆయ‌న సిద్ధంగా ఉండ‌మ‌ని సూచించారు. క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలోనూ.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో నూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తున్న తొండి వైఖ‌రిపై.. ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.

అంతా తొండి!

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు.. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కల కంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంద న్న టీడీపీ అధినేత ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎగ‌నామం అంటే.. ఇదే!

ఏపీలో `చేయూత` పేరుతో మోసం జరుగుతోందన్న చంద్రబాబు.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున కోత విధించారన్నారు. దీనిని 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లింపు జరుగుతోందని, ఇలా ఒక్కో మహిళకు రూ.లక్షా 5 వేలు ఎగనామం పెట్టి వంచించారని వివరించారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

తెల్ల ఏనుగులు!

తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకుంటే… ఏపీలో మాత్రం అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ రాజ్యమేలుతున్నాయన్నారు.

Tags: andhrapradeshChandrababuJaganjune 29TDPTelugu desam partywomen in andhraYSR CongressYSR Congress PartyYSRCP
Previous Post

ప‌వ‌న్‌కు చిరంజీవే శ‌త్రువా…  !!

Next Post

తన కేసులపై తానే తీర్పిచ్చుకున్న జగన్, ఆపేసిన హైకోర్టు

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post

తన కేసులపై తానే తీర్పిచ్చుకున్న జగన్, ఆపేసిన హైకోర్టు

Please login to join discussion

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra