వైసీపీ పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జయహో బీసీ సభను వైసీపీ నేతలు నిర్వహించారు. అందులోకూడా బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ అరిగిపోయిన రికార్డే వేసి…తన స్పీచ్ ముగించారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు టీడీపీ హయాంలో జరిగిన మేలేంటి? వైసీపీ హయాంలో కల్లబొల్లి మాటలతో జరిగి, జరుగుతున్న, జరగబోతోన్న అన్యాయం ఏమిటి అన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే బీసీలకు తామేం చేశామో చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ DNA బీసీలే. బీసీల గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీయే’’ అని చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీంతో, బీసీల నోట ఒకటే మాట.చంద్రబాబు గారి నాయకత్వంలోనే బీసీల అభివృద్ధి సాధ్యం…అని టీడీపీ అభిమానులు ఈ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు.
ఇక, బీసీల సభ నేపథ్యంలో జగన్ ను ఎండగడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తొచ్చారా జగన్ రెడ్డి గారూ? అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చాక బీసీలకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత అన్యాయం చేసింది జగన్ అని, వెనకబడినతరగతుల వెన్నుముక విరిచేసిన జగన్ కు బీసీల పేరెత్తే అర్హత లేదని ఆయన ఫైర్ అయ్యారు.
ముఖ్య పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకొని బీసీలకు చేసిన సామాజిక అన్యాయంపై బీసీ సభావేదిక నుంచి సమాధానం చెప్పాలని లోకేష్ నిలదీశారు. బీసీ సోదరులకు ఉపాధికి ఊతమిచ్చిన ఆదరణ నిలిపేసినందుకా జగన్ రెడ్డి జయహో అని బీసీలు నినదించాలి అంటూ ప్రశ్నించారు. బీసీ నేతల్ని, కార్యకర్తల్ని అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ మాత్రం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
జయహో బీసీ అంటే సరిపోతుందా జగన్ రెడ్డీ? బీసీలకు తెలుగుదేశం చేసిన మేలులో పిసరంతైనా నువ్వు చేసావా? అంటూ బీసీలకు జగన్ చేసిన అన్యాయాలపై ఓ పాట కూడా టీడీపీ రూపొందించింది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జయహో బీసీ అంటే సరిపోతుందా జగన్ రెడ్డీ? బీసీలకు తెలుగుదేశం చేసిన మేలులో పిసరంతైనా నువ్వు చేసావా? ఈ పాట విని ఒక్కసారి పోల్చి చూసుకో! #TDPBCparty #BCDrohiJagan #BcPartyTdp pic.twitter.com/lxf88oiENe
— Telugu Desam Party (@JaiTDP) December 2, 2022