టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాల్లో కొత్త మెరుపులు కురిపిస్తున్నారు. పంచ్ డైలాగులు విసురు తున్నారు. నిజానికి ఆయన విమర్శించడమో .. లేక అభివృద్ది గురించి వివరించడమో.. చేస్తారే తప్ప. పంచ్‌లతో ఎప్పుడూ ప్రసంగించింది పెద్దగాలేదు. కానీ, గత రెండు రోజులుగా తన ప్రసంగాల్లో మార్పు కనిపించేలా వ్యవహరిస్తున్నారు. పంచ్‌లతో ఇరగదీస్తున్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ప్రజాగళం సభ నిర్వహించారు.
ఈ సభకు కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా జనసేన తరఫున పవన్ కల్యాణ్ హాజర య్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “సిద్దం-సిద్ధం అనే వాళ్లకు మరిచిపోలేని యుద్ధం ఇస్తాం. ఇది నేను చెబుతున్నది కాదు.. ప్రజలే చెబుతున్నారు“ అని వ్యాఖ్యానించారు. అదేసయమంలో ప్రజలతో యుద్ధం చేయడానికి వైసీపీ సిద్ధమా అని నిలదీశారు. “ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు కరిగిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఐదేళ్లలో అన్ని విధాలా కరిగించేశాడు“ అంటూ.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
ప్రజల్లో అభద్రతా భావం కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకే తాము కూటమిగా చేతులు కలిపా మని అన్నారు. సీఎం జగన్ తమాషాలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై కాపు నాయకులతో విమర్శలు చేయిస్తూ.. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనే దమ్ము లేక.. ఇలా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న జగన్‌ను తరిమి కొట్టేందుకు జనసేన కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్‌ను అదిరిపోయేలా కొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. అనేక రూపాల్లో వారికి మేలు చేశామన్నారు. పింఛన్ల నుంచి పదవుల వరకు.. అన్ని విధాలా వారిని ఆదుకున్నట్టు చెప్పారు. 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. మహిళలు, బీసీల కోసం పోరాడుతామన్నారు. “ఓటు వేసే ముందు గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఊహించుకోండి. మీ కష్టాలు తొలిగి పోవాలంటే.. కూటమి అభ్యర్థులను గెలిపించండి“ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దేశానికి అన్నం పెట్టె రైతన్నకు ఏటా రూ.20,000 ఆర్థికసాయం అందించి ఆదుకుంటా.#BabuSuper6 #JaruguJagan_NippulantiBabu #TDPJSPBJPWinning#AndhraPradesh pic.twitter.com/HHUuQVomGh
— Telugu Desam Party (@JaiTDP) April 11, 2024