ఎంత సంపద ఉంటే మాత్రం.. మరీ ఇంత ఒళ్లు బలుపా? అన్నట్లుగా మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాల్ని ఉద్దేశించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. అగ్రరాజ్య అహంకారం నెత్తికి బాగానే పట్టేసినట్లుగా అనిపించక మానదు. తాను విధించిన అడ్డగోలు సుంకాల వేళ.. అగ్రరాజ్యంతో సున్నం పెట్టుకోవటానికి ఇష్టం లేని దేశాలు.. సంప్రదింపుల మార్గంలో ఇష్యూను క్లోజ్ చేయాలని అనుకుంటున్న పరిస్థితి.
చైనా..కెనడా లాంటి దేశాలు తన వ్యతిరేక వాదనను వినిపించేందుకు వెనుకాడలేదు. ప్రపంచ దేశాల్లో ఒక్క చైనా మాత్రమే అమెరికాతో ఢీ అంటే ఢీ అనటమే కాదు.. ట్రంప్ తొండికి సరైన రీతిలో సమాధానం ఇస్తూ.. ఆయన ఈగోను ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ తీస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాల నేతలు తాను విధించిన సుంకాల షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన ఎటకారం ఆడేశారు.
‘ప్లీజ్ సర్.. ప్లీజ్ సర్..ప్లీజ్ మేం ఏమైనా చేస్తాం సర్’ అంటూ తనను పదే పదే సంప్రదిస్తున్నట్లుగా ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన దారుణ పదాన్ని వాడేందుకు వెనుకాడలేదు. రాయలేని భాషలో ఉన్న ఆయన మాటను సభ్యత ఉన్న వాళ్లు ఎవరూ మాట్లాడలేరు. అందుకు సగం మాత్రమే ఇక్కడ రాస్తున్నాం. ‘కిస్సింగ్ మై యా..’’ అంటూ మదమెక్కిన మాటలు మాట్లాడారు. రాయటానికి వీల్లేని అసహ్యకరమైన భాషను వాడిన ట్రంప్ తీరును పలువురు ఖండిస్తున్నారు.ఈ ఒళ్లు బలుపునకు సరైన సమాధానం ఎవరిచ్చినా ఇవ్వకున్నా కాలం మాత్రం తప్పనిసరిగా ఇస్తుందని చెప్పక తప్పదు.