ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన పాలనకు సంబంధించిన అంశాలపైనా.. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాలపైనా ఫిర్యాదు చేయటానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ విపక్ష నేత చంద్రబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి చంద్రబాబు వివరించారు. ఏపీలో పరిస్థితిపై వివరాల్ని తాను కనుక్కుంటానని రాష్ట్రపతి చెప్పినట్లుగా చెబుతున్నారు. టీడీపీ నేతలు చెప్పిన విషయాలు చాలా సీరియస్ అని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి రాష్ట్రపతి అడిగినట్లుగా చెబుతున్నారు. అమరావతిని సీఎం జగన్ పాలనతో పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా బాబు తెలిపినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. రాజమండ్రి శిరోముండనం కేసు విషయంలో రాష్ట్రపతి ఆదేశాలపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ టీం దేశ ప్రథమ పౌరుడికి చెప్పినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలోని ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ఫిర్యాదు చేశామన్నారు.
మొత్తం నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్న ఆయన.. ఏపీలో ఆర్టికల్ 356 ను అమలు చేయాలని.. పార్టీ కార్యాలయాల మీద జరిపిన దాడుల ఉదంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు.. ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని.. డీజీపీని రీకాల్ చేయాలని.. ఆయన చేసిన తప్పులకు శిక్ష పడాలని కోరినట్లుగా వెల్లడించారు.
మొత్తంగా రాష్ట్రపతికి ఎనిమిది పేజీలతో కూడిన లేఖను.. వాటి ఆధారాల్ని అందించినట్లుగా చెప్పారు. ఏపీలో ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల మీదా.. నేతల మీదా దాడులు జరుపుతున్నారన్నారు.
డీజీపీ.. పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరన్న ఆయన.. తమ పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడిన వారిని పోలీసులే పంపిస్తున్నారని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంగా పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలన్నిఏపీలోనే ఉంటున్నాయన్నారు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీ నేతల్ని.. ప్రజల్ని భయాందోళనలకు గురవుతున్నట్లు చెప్పారు. రెండేళ్లుగా జగన్ రెడ్డి చేస్తున్న పాలనపై పుస్తకాన్ని పార్టీ రూపొందించిందని.. ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్’ అనే బుక్ ను విడుదల చేయటం గమనార్హం.