టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన చంద్రబాబు.. ఇక్కడ రోడ్ షో నిర్వహించి.. ప్రజలనుఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్పై నిప్పులు చెరిగారు.
ఒక్క ఛాన్స్ మాయలో పడి ఓట్లేసి గెలిపించిన జగన్ ఇప్పుడు ప్రజలకు నరకం చూపుతున్నాడని విమర్శించారు. వివిధ రకాల నిబంధనలతో పింఛన్ తొలగించడం, పలు రకాల పన్నులు విధించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమ న్నారు.
‘నాకు బొబ్బిలి రావటం కొత్త కాదు. నేను సినీ సూపర్ స్టార్ కాదు. మరి ఈ జనం రాక ఏ సంకేతానికి చిహ్నం? జగన్ రెడ్డి నీకు కళ్లుంటే ఈ జనం చూడు. ఎంత మంది వచ్చారో లెక్క పెట్టడం నీతరం కాదు’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీలకు పూర్వ వైభవం తెస్తానన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అన్నిరంగాల్లోనూ ప్రాధాన్యం ఇచ్చానని గుర్తు చేశారు.
టీడీపీకి అండగా ఉండి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వానికి బీసీలంటే లెక్కలేద న్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి సాక్షి పత్రికకు ఏటా వందల కోట్లు ప్రకటలకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.
వలంటీర్లు సహా సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో సాక్షి పత్రిక కొనేలా మౌఖిక ఆదేశాలివ్వడం సిగ్గుచేటన్నారు. రాజకీయంతో వ్యాపారానికి ముడిపెట్టవద్దని చంద్రబాబు హెచ్చరించారు.
జగన్ రెడ్డి నేను ఎక్కడున్నానో ఈ బొబ్బిలి కోటలో చూడు – @ncbn . #CBNinBobbili pic.twitter.com/Y39ZKLl8qX
— iTDP Official (@iTDP_Official) December 23, 2022
జగన్ను జైలుకు పంపిస్తా!
‘బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించావు. నిన్ను జైలుకు పంపలేమా జగన్. అచ్నెన్నాయుడిపై కేసు నమోదు చేసేందుకు గోడ దూకారు. గౌతు లచ్చన్న మనవరాలు శిరీషపై కేసు పెట్టారు. కళావెంకటరావును అర్ధరాత్రి పొలీస్ స్టేషన్కు తరలించారు. అయ్యన్నపాత్రుడిపై రేప్ కేసు పెట్టారు. కూన రవిపై ఎన్ని కేసులు పెట్టారో పొలీసులకే తెలియదు. ఇదేనా నీకు బీసీలపై ఉన్న ప్రేమ?’ అని చంద్రబాబు నిలదీశారు.
బొబ్బిలి పురవీధుల్లో విజయనినాదమై గర్జించిన ప్రజలు ???????? #TDPWillBeBack pic.twitter.com/Rt4nOsxVtY
— iTDP Official (@iTDP_Official) December 23, 2022
టీడీపీలో చేరికలు..
రాజాం నియోజకవర్గం పరిధిలో గుయ్యన్నవలస, వావిలివలస గ్రామాలకు చెందిన 1500 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు, వైసీపీలో ఎంత కష్టపడినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు సరికదా ఎన్నికల మందు ప్రజలకు ఇచ్చిన హమీలు నేరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్ విపలమయ్యారని, అందుకే టీడీపీలో చేరామని రెండు గ్రామాల వారు చంద్రబాబుకు వివరించారు.