ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కి తాజాగా బిగ్ షాక్ తగిలింది. జగన్ మెప్పు పొందడం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేసిన అక్రమాలకు ఇప్పుడు రిటర్న్ గిఫ్టులు వస్తున్నాయి. ఎన్నికల్లో పరాజయం తర్వాత కొడాలిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల గుడివాడలో వాలంటీర్లు తమ చేత ఎన్నికల టైమ్ లో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కొడాలిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొడాలి నాని తో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలను కూడా ప్రభాకర్ తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నారు.
దాంతో కొడాలి నాని, వాసుదేవ రెడ్డి మరియు మాధవి లతా రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, ఆర్ అండ్ డబ్ల్యూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ హయాంలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. ఈ క్రమంలోనే నిమ్మకాయ నీళ్ళకు రూ. 28 లక్షలు గుడివాడ గుట్కా కొడాలి నానితో కలిసి కేడీ జగన్ కొట్టేశారని మంత్రి నారా లోకేష్ తాజాగా కొన్ని విస్తుపోయే విషయాలను బయటపెట్టారు.
టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభ అంటూ ఒక ఫేక్ సభ పెట్టి నిమ్మకాయ నీళ్లు సరఫరా పేరుతో రూ. 28 లక్షలను నోకేశారని.. పేదలకి టిడ్కో ఇళ్లు మంజూరు చేయడానికి రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని.. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ. 70 లక్షలు బిల్లులు చేసుకోవడాని ప్రయత్నం చేశాని కొడాలి నానిపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.