• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎవ‌రీ మాల్వి మల్హోత్రా.. రాజ్ త‌రుణ్ తో ఆమె రిలేష‌న్ నిజ‌మేనా?

admin by admin
July 6, 2024
in Movies, Trending
0
0
SHARES
485
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి పేరుతో రాజ్ త‌రుణ్ త‌న‌ను మోసం చేశాడని హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాము ప్రేమ‌లో ఉన్నామ‌ని.. ఒకే ఇంట్లో స‌హ‌జీవ‌నం కూడా చేశామ‌ని.. 3 నెలల కిందట రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడ‌నిని లావ‌ణ్య త‌న ఫిర్యాదులో పేర్కొంది. తిరగబడరా సామీ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కార‌ణంగానే రాజ్ త‌రుణ్ త‌న‌ను వ‌దిలేశాడ‌ని లావ‌ణ్య ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఆ సినిమా షూటింగ్ టైమ్ లో రాజ్ తరుణ్ కు, మాల్వికి ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం రిలేష‌న్‌షిప్‌గా మారింద‌ని.. వారిద్ద‌రూ ఇప్పుడు క‌లిసే ఉంటున్నార‌ని లావ‌ణ్య చెప్పుకొచ్చారు. అయితే రాజ్ త‌రుణ్ మాత్రం లావ‌ణ్య‌తో విడిపోవ‌డానికి మాల్వి కాద‌ని అంటున్నాడు. మాల్వితో త‌న‌కు ఫ్రెండ్షిప్‌ త‌ప్పా మ‌రే రిలేష‌న్ లేదని తేల్చేశాడు. లావ‌ణ్య డ్ర‌గ్స్ కు, చెడు స్నేహాలకు అల‌వాటు ప‌డ‌టం వ‌ల్లే.. 2017లో ఆమెతో రిలేష‌న్ ముగించాన‌ని చెబుతున్నాడు. మొత్తానికి రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య వ్య‌వాహంలో మాల్వి మ‌ల్హోత్రా హైలెట్ గా నిలిచింది.

ఈ నేప‌థ్యంలోనే ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్లు ఉత్సాహం చూపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మండి అనే ఊరిలో ఒక పంజాబీ ఫ్యామిలీలో మాల్వి జ‌న్మించింది. తండ్రి సుశీల్ మల్హోత్రా కాగా.. తల్లి బందన మల్హోత్రా. ముంబై యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన మాల్వి.. యాక్టింగ్ పై ఉన్న ప్యాష‌న్ తో ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. 2017లో ఉడాన్ అనే హిందీ సీరియ‌ల్ ద్వారా త‌న కెరీర్ ను ప్రారంభించింది.

2018లో విశాల్ మిశ్రా డైరెక్ట్ చేసిన హోటల్ మిలన్ మూవీతో మాల్వి వెండితెర‌పై అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న మాల్వి.. 2023లో జోరావర్ డి జాక్వెలిన్ అనే ఓటీటీ ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది అభ్యుహం అనే సినిమాతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. హిందీ, పంజాబీ భాష‌ల్లో అనేక మ్యూజిక్ వీడియోస్‌లో మాల్వి వ‌ర్క్ చేసింది. ఇక ఈ ఏడాది తిరగబడరా సామీ చిత్రంతో తెలుగువారికి హాయ్ చెప్పాల‌నుకుంది. కానీ రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య దెబ్బ‌కు ఫ‌స్ట్ మూవీ రిలీజ్ కాకుండా టాలీవుడ్ లో మాల్వి ట్రెండ్ అవుతోంది.

Tags: Actress Malvi MalhotraLavanyaMalvi MalhotraRaj TarunRaj Tarun Longtime PartnerTelugu Actor Raj TarunTelugu moviesThiragabadara SaamiThiragabadara Saami MovieTollywood
Previous Post

కొడాలి నాని కి బిగ్ షాక్‌.. న‌మోదైన మ‌రో కేసు!

Next Post

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. అక్క‌డ వేయించుకుంటే ఊరుకోమంటున్న పోలీసులు!

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Load More
Next Post

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. అక్క‌డ వేయించుకుంటే ఊరుకోమంటున్న పోలీసులు!

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra