ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సీరియస్ కామెంట్స్ చేశారు. జగన్కు రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బైబై చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. “జగన్ చెబుతున్న సంక్షేమం రాష్ట్ర ప్రజలకు కొత్తకాదు. ఇప్పుడు ఈయనే ఏదో దిగి వచ్చి ఇస్తున్నట్టు డబ్బా కొట్టుకుంటున్నాడు“ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, జగన్ పాలనపై విసిగిపోయారని గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తాజాగా జరిగిన పరిణామాలపై స్పందించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. విశాఖలో ఒక ఎంపీ స్థాయి వ్యక్తి కుటుంబ సభ్యులు కిడ్నాప్ శాంతి భద్రతల పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
“సాధారణంగా ఎంపీ అంటే ఎంతో కొంత భద్రత ఉంటుంది. అలాంటి ఎంపీ భార్య, కుమారుడినే కిడ్నాప్ చేస్తే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఇదే నా శాంతి భద్రతలు.. బాగున్నాయని చెప్పడం?“ అని గంటా ప్రశ్నించారు. ఇక, తాజాగా నిధులు జమ చేసిన జగనన్న అమ్మ ఒడిపై మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట తప్పారని.. మడమ తిప్పారని దుయ్యబట్టారు. సగం మందికి మాత్రమే అమ్మఒడి డబ్బులు ఇవ్వడం దారుణమని అన్నారు.
అందరికీ ఇస్తాం..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తల్లికి వందనం కార్యక్రమం కింద నిధులు అందిస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నా వారికి డబ్బులు ఇస్తామని గంటా చెప్పారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు. టీడీపీ బస్సు యాత్రలకు స్పందన వస్తోందని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? చంద్రబాబుని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి రా బాబు…
????????????????????????????????
ఈ @YSRCParty నా కొడుకులు ఎన్నికల సమయానికి జనాల మధ్య కజల,మాత,ప్రాంత వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తారు…#LetsUniteToPutTheStateOnTrack#HelloAP_ByeByeYCP #ByeByeJagan pic.twitter.com/07lmsYRskT
— ???????? ???????????????????????? ???????????? (@manoj_manam2) June 27, 2023