పార్లమెంట్ భవనంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వేతనజీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్లుగానే బడ్జెట్ 2025 లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది.
రూ. 12 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమన్న కేంద్రం.. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపితే రూ.12.75 లక్షల వరకు సున్నా పన్ను వర్తిస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కు ఇది నిజంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇక కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబులను సవరించినట్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు.
రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 25 శాతం టాక్స్ వర్తిస్తుంది. అలాగే రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం టాక్స్, రూ.16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి 20 శాతం టాక్స్ వర్తిస్తుంది. ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉంటుంది.