వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. దేవాలయం లాంటి అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న సమస్యలపై చర్చించకుండా ఇళ్లలో ఉన్న మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం దుర్మార్గపు చర్య. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు. వైసీపీ నేతలు ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు, వారి భాషను ప్రజలు చీకొడుతున్నారు. ఇకనైనా వైసీపీ నేతలు తమ ప్రవర్తన మార్చుకోవాలి.
చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి.
బుచ్చి రాంప్రసాద్
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి