భారత రాష్ట్ర సమితి ఏపీలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాపు నాయకులకు గేలం వేస్తోందని.. వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాపు నేతలను జనసేనకు కాకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఏం చెబుతారు? అని కొన్నాళ్లుగా ఏపీ ప్రజలు ఎదురు చూశారు.
అయితే, సమయమో.. సందర్భమో.. కలిసినవచ్చినట్టుగా పవన్ దీనిపై వ్యాఖ్యలు చేశారు. ఏపీలోకి బీఆర్ ఎస్ వస్తే.. తప్పేంట ని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు.. స్వాగతిస్తామన్నారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు కూడా తప్పుకాదని తేల్చి చెప్పారు. అయితే.. తన పార్టీకి చెందిన తోట చంద్రశేఖర్ సహా రావెల కిశోర్ బాబులు పార్టీ మారడంపై మాత్రం పవన్ మౌనం వహించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ బీఆర్ ఎస్‌కు అనుకూలంగా మాట్లాడడం చిత్రంగానే తోచింది.
ఎందుకంటే.. ఏపీ వారిని తిట్టిపోసిన.. కేసీఆర్ అని మరోవైపు.. ఏపీలో కాపులు ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో నే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. కాపులను పవన్‌కు దూరంగా చేయాలని చూస్తున్నారని, జగన్‌తో కలి సి కుట్రలు పన్నుతున్నారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు సహజంగానే విస్మయాన్ని కలిగించాయి. నిజానికి రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చనని చెబుతున్నపవన్.. బీఆర్ ఎస్ పార్టీకి ఆహ్వానం పలకడం ద్వారా.. ఓట్ల చీలిక అంశాన్ని మరిచిపోతున్నారా? అనే సందేహమూ తెరమీదికి వస్తోంది.
ఎందుకంటే.. పార్టీలు ఎక్కువయ్యేకొద్దీ.. ఓట్ల చీలిక పెరుగుతుంది. ఇది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ.. వైసీపీకి మేలు చేస్తుంది. మరి ఈ చిన్న లాజిక్ తెలియకుండా.. పవన్ వ్యాఖ్యానించారని అనుకోలేం. అయినప్పటికీ.. పవన్ బీఆర్ ఎస్‌ను ఆహ్వానిస్తున్నారంటే.. ఏదో జరుగుతోందని, చాలా ముందు చూపుతోనే ఆయన వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో..!