ఏపీ రాజకీయ చరిత్రలో బీజేపీ తేనె తుట్టెను కదుపుతోంది. ఆ తేనెతుట్టె ఎవరో కాదు కాపు సామాజికవర్గమే. తేనెతుట్టెను కదిపిన వారికే కాదు, పక్కనున్న వారికీ డేంజరే. కాపుల్లో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి, అన్ని వర్గాల్లో ఆదరణ చూరగొన్న వ్యక్తి అయిన చిరంజీవి రాజకీయాల్లోకి వస్తేనే అతన్ని సొంత గడ్డపై ఓడించింది సొంత సామాజిక వర్గమే. ఆయన తమ్ముడు పవన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది కూడా ఆ సామాజిక వర్గమే.
ఇక టీడీపీ హామీ ఇచ్చిన వాటిలో తన చేతిలో ఉన్నవన్నీ నెరవేర్చినా, చెప్పనవి కూడా చేసి చూపినా… 2019లో చంద్రబాబును ఓడించడానికి సొంత వాడు అయిన పవన్ గొంతు కూడా నులిమేశారు కాపులు. పవన్ కి ఓటేస్తే బాబుకు లాభం చేకూరుతుంది కాబట్టి… పవన్ ఏమైపోయినా పర్లేదు చంద్రబాబును చిత్తుగా ఓడించాలని తమ నాయకుడు, పవన్-వంగవీటి కుటుంబాలను తిట్టిన జగన్ కి జైకొట్టారు. వారికి సొంత వారిపై ప్రేమ కంటే ఇతరులపై కోపమే ఎక్కువ బలంగా ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎవరైనా కాపు సామాజిక వర్గాన్ని చాలా సులువుగా రాజకీయంగా కెలికే అవకాశం ఇస్తారు.
ఈ క్రమంలో వారు లాభం పొందరు, ఇతరులు లాభం పొందే అవకాశాన్ని విజయవంతం కానివ్వరు. సంబంధం లేని కొత్త శత్రువును భుజాల మీద మోస్తారు కానీ నచ్చని పాతమిత్రుడిపై పగబట్టి సాధిస్తారు. ఇప్పటికే అనేక సార్లు ఏపీరాజకీయాల్లో ఇది ప్రూవ్ అయ్యింది.
ఇంత జరిగిన తర్వాత కూడా బీజేపీ … ఆ సామాజిక వర్గంతో జతకట్టింది. ఎక్కడ కాపులను దరిచేర్చుకునే అవకాశం ఉన్నా వదులుకోవడం లేదు. మాది కాపు పార్టీ అనే ముద్ర వేయించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
ఇందుకోసం పవన్ తో జతకట్టింది. పవన్ సామాజికవర్గం కోసమే ఈ పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. అలాగే… కాపు నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. తాజాగా కాపు ఉద్యమానికి నాయకుడిని అని చెప్పుకున్న ముద్రగడ వెంటపడింది. అంటే బీజేపీ వేసే ప్రతి అడుగు కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే దిశగానే సాగుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశంలో ఉంటూ మనసును ఎక్కడెక్కడో పారేసుకుంటున్న వంగవీటి రాధపై కూడా బీజేపీ కన్నేసింది. కాపులకు అత్యంత ఇష్టమైన నాయకత్వాల్లో వంగవీటి నాయకత్వం ఒకటి.