ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేంద్రం పెద్దలు ఫోకస్ పెట్టిన రాష్ట్రం కాకపోవడం వల్ల ఏపీ బీజేపీ నేతలు… పవన్ ఇచ్చిన అండను దుర్వినియోగం చేసి పవన్ కే హాని చేసేందుకు ప్రయత్నించిన విషయం ఈరోజు అనుకోకుండా బయటపడింది.
ఏపీలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ పాలన సాగిస్తున్న జగన్ ను ఎలాగైనా అధికారం నుంచి దించి పీడిత ప్రజలను కాపాడాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమను, పెట్టుబడిదారులను ఇబ్బంది పెడుతూ తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి పీఠం ఎక్కకుండా చేయాలన్న తలంపుతో పవన్ ఉన్నారు. అందుకే ఓట్ల చీలిక జరగకూడదన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ వ్యూహం పన్నుతున్నారు.
అయితే, టీడీపీతో జనసేన కలిస్తే ఓట్లు చీలకుండా ఉంటాయని దానివల్ల జగన్ ఓడిపోతాడని జగన్ అనుకూల విధానాలతో బీజేపీ ఏపీ నేతలు కుట్రపన్నుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పవన్ కలవకుండా వైసీపీ నేతలు చేయని ప్రయత్నమే లేదు. కానీ పవన్ మీ కల నెరవేరదు అని బహిరంగంగా చెప్పాడు. కానీ ఇటీవల జగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి సంతోషపడాల్సిన బీజేపీ నేతలు ప్రష్ట్రేషన్లో పవన్ పై ఆరోపణలు చేస్తున్నారు.
జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టే ఉన్నాం. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారు. మాతో పవనే కలిసిరావడం లేదనేది మా ఆరోపణ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించమని మేం పవన్ని కోరాం.. ఆయనే స్పందించలేదు-బీజేపీ నేత మాధవ్#JanasenaParty #BJP #Pawankalyan
— NTV Breaking News (@NTVJustIn) March 21, 2023
ఇపుడు పవన్ అనుకున్నదే జరిగింది. పవన్ బీజేపీకి మద్దతు ఇచ్చి ఉంటే కచ్చితంగా ఓట్లు చీలి జగన్ గెలిచేవాడు. ఈ ఏపీ బీజేపీ నేతలకు కావల్సింది కూడా అదే. అందుకే జగన్ సీట్లు కోల్పోయినందుకు తీవ్రంగా వేదన చెందుతున్నారు.
మాధవ్ చేసిన తాజా వ్యాఖ్యలతో బీజేపీ పవన్ ను వాడుకుని జగన్ గెలిపించడానికి చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలు అయ్యాయి.