నందమూరి నటసింహం బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంఘిక, సందేశాత్మక, చారిత్రక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలలోనూ మెప్పించగల నటనా చాతుర్యం బాలయ్య సొంతం. ఇక, తెలుగు నుడికారంపైనా , భాషపైనా బాలయ్య అంత పట్టున్న నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే, అవకాశం చిక్కినప్పుడల్లా పలు వేదికలపై బాలయ్య తెలుగుపై తనకున్న మక్కువను చాటుతుంటారు.
తేట తెలుగు పద్యాలతో, పౌరాణిక డైలాగులతో అభిమానులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య మద్యంపై పాడిన ఓ పద్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ స్టాపబుల్
#HappyKanuma #JaiBalayya
కనుమ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/kKBVltSnjT— మాయాబజార్ (@rsloya3969) January 16, 2022
విత్ ఎన్బీకే అంటూ హోస్ట్ గా అదరగొడుతున్న బాలయ్య…పూరీ జగన్నాథ్ ను తన షోకు పిలిపించి పద్యంతో పంచ్ లు వేశారు. మద్యంపై పద్యం పాడిన బాలయ్య…పూరీతోపాటు అక్కడున్న ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచారు.
సంక్రాంతి స్పెషల్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్లో ‘లైగర్’ టీమ్ సందడి చేసింది. పూరీ జగన్నాథ్, నిర్మాత, నటి ఛార్మి, రౌడీ హీరో విజయ్ దేవరకొండలు బాలయ్యతో పండుగ ముచ్చట్లు చెప్పారు. లైగర్ సినిమా విషయాలు, షూటింగ్ సంగతులు పంచుకున్నారు. దాంతోపాటు, బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు అడగడంతో తమ తమ వ్యక్తిగత విషయాలపై కూడా ఈ ముగ్గురూ ఓపెన్ అయ్యారు. ఇక, మధ్యలో బాలయ్య మద్యంపై పద్యంతో అలరించాడు.
గుక్కతిప్పుకోకుండా, తడబడకుండా పద్యం పాడిన బాలయ్య మందు బాబులకే కాదు మామూలు జనానికి కూడా ఎంతో నచ్చింది. ఇక, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ లో ‘మామా ఎక్ పెగ్‌లా’ అంటూ స్టెప్పులేసి ఆడిపాడిన బాలయ్య…తాజాగా మరోసారి మందుపై పద్యం పాడడంతో పూరీ కూడా ఎంజాయ్ చేశారు. దీనికి సంబధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.