కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు రంగం రెడీ అయింది. వచ్చే నెల 1 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేసేది ఎవరో.. తేలిపోయింది. అయితే.. మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ-జనసేనల కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఇదే విజయం రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక జరిగితే(తిరుపతి).. అక్కడ బీజేపీ టికెట్ దక్కించుకుంది. అయితే.. తిరుపతి నుంచి తామే పోటీ చేస్తామని.. ముందుగానే ప్రకటించినా.. జనసేనకు ఇది వర్కవుట్ కాలేదు.
ఢిల్లీలో కమిటీ వేసి తేలుస్తామనిచెప్పినా.. సాధ్యం కాలేదు. తర్వాత ఏమైందో ఏమో.. జనసేన ఈ టికెట్‌ను కోల్పోయి.. ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. మరి ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పట్టు సాధిస్తుందా. ఇక్కడ నుంచి ఆపార్టీ గెలుస్తుందా? అనేది ప్రశ్నగా మారింది.
ఇటీవల బీజేసీ సారథి.. సోము వీర్రాజు మాట్లాడుతూ.. తమకు కడపలో పట్టు ఉందని.. తమ నాయకులు ఎక్కువ మంది ఉన్నారని.. సో.. తామే గెలుస్తామని.. వ్యాఖ్యానించారు. నిజానికి కడపలో ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కువ మందే ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ వంటివారు ఉన్నారు.
అయితే.. వీరు స్థానిక రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గా లేక పోవడం గమనార్హం. అయితే.. బీజేపీలోనే ఉన్నారు. కానీ.. వీరిని ఉద్దేశించే సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనిపిస్తోంది. అదేసమయంలో మరోసారి టికెట్ దక్కించుకునే వ్యూహంతోనూ ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ఇప్పుడు కూడా.. తమకే టికెట్ దక్కాలనే వ్యూహంతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేన నుంచి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి వ్యూహం బయటకు రాలేదు. అయితే.. అంతర్గత సమావేశాల్లో మాత్రం.. బద్వేల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది.
ఇప్పటికే 2019 తర్వాత.. ఇప్పటి వరకు ప్రజల్లో తమ ప్రభావం పెరిగిందని.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. ముఖ్యంగా అధికార పార్టీపై విముఖత పెరుగుతోందని.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడిందని.. దీనిని అస్సలు విడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా నాయకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే బద్వేల్ నుంచి తప్పకుండా ఎస్సీ నాయకుడిని నిలబెట్టి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అంతర్గత సమావేశంలో నిర్ణయించారు. దీనిని బట్టి.. రేపు ఒకవేళ బద్వేల్ టికెట్ కనుక తమకు కావాలని పట్టుబడితే.. అవసరమైతే.. తాము సొంతగానే ఇక్కడ నుంచి దిగాలని నిర్ణయించుకునే పరిస్థితి కూడా ఉందని తెలుస్తోంది. మరి ఇదే జరిగితే.. ఇక.. బీజేపీతో జనసేన కటీఫ్ చేసుకున్నట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.