అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనముందున్న కోవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం ఎంతో మంది కావలసిన వారిని ఆప్తులను కోల్పోతున్నా వార్తలు విన్న (ఆటా) అధ్యక్షులు భువనేశ్ బుజాల మరియు ఆట సభ్యులు ఆధ్వర్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్ సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకొని యుద్ధప్రాతిపదికన వీటిని సమకూర్చుకొని మొదటి విడతగా మన రాష్ట్రానికి పంపించడం జరిగింది.
ఈ రోజు వీటిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కొల్లాపూర్, కల్వకుర్తి కి గాను ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో DM&HO సుధాకర్ లాల్, ఇండియా ఆటా కోఆర్డినేటర్ కరకాల కృష్ణారెడ్డి, సురేఖ, రమేష్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ అసుపత్రిలకు లకు అందజేయఢం జరుగుతుంది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ , ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్స్ అందజేయడం జరుగుతుందని ఇవి కాకుండా ఇంకా ఎటువంటి అవసరం మైన ఉన్నట్లయితే అవి కూడా త్వరగా తేప్పించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా అమెరికాలో ఉంటూ మన వాళ్ల కోసం మన వారి ఆరోగ్య అవసరాలను తీర్చేవిధంగా సహకరిస్తున్న అందర్నీ ప్రత్యేకంగా అభినందించారు.