దేశం కానీ దేశంలో తెలుగు వారి ఖ్యాతి, తెలుగు జాతి ఐక్యత, సఖ్యత వీటిని చాటుతూ తెలుగు భాష ను సుసంపన్నం చేసేందుకు, ముందు తరాలకు అందించేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఇప్పటిదాకా కృషి చేస్తూ ఉంది. ఇకపై కూడా ఈ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారంతా ఒకే వేదికపై ఉంటూ..వారి సంస్కృతులు గౌరవించుకుంటూ సంబరంగా సాగే ఆటా వేడుకలకు ఈ సారి వాషిగ్టంన్ డీసీ కేంద్రం అయింది. ఇదే వేదికపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఉన్న తెలుగు వారి కోసం కృషి చేస్తున్న ఆటా., తానా కలిసి ఏదయిన ఒక నగరంలో హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేసుకుని, అక్కడ తెలుగు సంస్కృతులు, చరిత్ర చాటి చెప్పే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పారు.
కొత్త ఉత్సాహం నింపిన కవితక్క
అమెరికాలో ఆటా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17 వ మహా సభలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని, అమెరికా తెలుగు అసోసియేషన్ కాదని..తనదైన శైలిలో అర్థం చెప్పి సభికులను ఆకట్టుకున్నారు.
ఒకప్పుడు తెలుగువారికి ఎన్టీఆర్ గొప్ప గుర్తింపు తీసుకువస్తే, ఇప్పుడు కేసీఆర్ అదేవిధంగా తెలుగువారికి గుర్తింపు తెస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించి, ఇటువంటివి ప్రతి ఏటా ఆటా సభల్లో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరారు. మహా సభల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్న వైనంపై ప్రశంసలు కురిపించారు.
Daughter of #Telangana CM @RaoKavitha K.Kavita Rao Addressed Indian diaspora at the 17th Convention and Youth Conference of the #American Telugu Association (ATA). pic.twitter.com/oGxbH9vJYw
— Mohd Lateef Babla (@lateefbabla) July 3, 2022
Addressed Indian diaspora at the 17th Convention and Youth Conference of the American Telugu Association (ATA) pic.twitter.com/mfv9OmC7V3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 3, 2022