• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మెగా మీటింగ్… మోడీతో పాటు మెగా అన్నదమ్ములు

NA bureau by NA bureau
July 3, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
53
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆజాదీ కా అమృతోత్స‌వంలో భాగంగా  ఈనెల నాలుగున మోడీ రానున్న నేప‌థ్యంలో అంద‌రి చూపు మోడీ వైపు ఉంది.. మోడీ చూపు ఆ ఊరి వైపు ఉంది. అల్లూరి  జ‌యంత్యుత్స‌వాల్లో పాల్గొనేందుకు ఇక్క‌డికి విచ్చేయ‌నున్న మోడీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. అయితే మోడీ రాక‌తో పాటు రెబ‌ల్ ఎంపీ ట్రిపుల్ ఆర్ రాక కూడా కాక రేపుతోంది.

ఈ ఇద్ద‌రే కాదు మ‌రో ఇద్ద‌రు కూడా ఇటుగానే రానున్నారు. వారే మెగా బ్ర‌ద‌ర్స్. ఏ విధంగా చూసుకున్నా స్టార్లంతా క‌లిసి ఓ చోటే ఉండ‌నున్నారు. ఇక ప్ర‌ధానికి చంద్ర‌బాబు ఓ లేఖ రాసి చ‌ర్చ‌కు తావిచ్చారు. పార్ల‌మెంట్ ప్రాంగ‌ణాన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌ధాన డిమాండ్.

ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో  బాబు రాసిన లేఖ ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎప్ప‌టి నుంచో ఈ ప్ర‌తిపాద‌న ఉంది కానీ బాబు కద‌లిక తీసుకు రావ‌డంతో వైసీపీ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది. ప్ర‌ధాని రాక ఇక్క‌డి భీమ‌వ‌రం ప్ర‌జల్లో ఎన్న‌టికీ గుర్తుండి పోతుంద‌ని పేర్కొంటూ, తెలుగు ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మ‌రోవైపు మోడీ స‌భ‌కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మ‌రం అయ్యాయి. 16 ఎక‌రాల్లో  పెదఅమిరంలో స‌భ‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. మోడీ రాక నేప‌థ్యాన అన్ని పార్టీల శ్రేణులూ ఇక్క‌డికి రానున్నాయి. పార్టీలకు అతీతంగా అల్లూరి జ‌యంత్యుత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నాం అని మోడీ చెప్పిన మాట, ఇచ్చిన పిలుపు మేర‌కు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు త‌ర‌లి రానున్నారు.

తొమ్మిది వేల బ‌స్సుల్లో ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు స్థానిక బీజేపీ నాయ‌క‌త్వం ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకుంది. ఇందుకు అల్లూరి సీతారామ రాజు ఉత్స‌వ క‌మిటీ సహ‌క‌రిస్తోంది. ప‌లు విద్యా సంస్థ‌ల బస్సుల‌ను కూడా వాడుకుంటున్నారు.

ఇక మెగాస్టార్ రాక కూడా క‌న్ఫం అయింది.  ఉత్స‌వ క‌మిటీ ఆయ‌న రాక‌ను నిర్థారించింది. మ‌రో అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రానున్నారు అని తెలుస్తోంది. వీరే కాకుండా టీడీపీకి చెందిన ముఖ్య నాయ‌కులు కూడా రానున్నారు. చంద్ర‌బాబు రాకున్నా ఆయ‌న  త‌ర‌ఫున ప్ర‌తినిధిగా రాష్ట్ర అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు రానున్నారు.

వామ ప‌క్ష నాయ‌కులు కూడా ఇటుగా వ‌చ్చే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో క‌మ్యూనిస్టులకూ అల్లూరి ఆరాధ్య నాయ‌కుడు క‌నుక వాళ్లు కూడా  వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. మ‌రోవైపు అల్లూరి న‌డ‌యాడిన మోగ‌ల్లులో ఓ స్మార‌క మందిరం క‌ట్టాల‌ని అక్క‌డి గ్రామ‌స్తులు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags: BJPmega meetingModi
Previous Post

ఎన్వీ ర‌మ‌ణ – తెలుగులో గర్వంగా మాట్లాడండి

Next Post

‘ఆటా’ అంటే కొత్త అర్థం చెప్పిన ఎమ్మెల్సీ క‌విత !

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

'ఆటా' అంటే కొత్త అర్థం చెప్పిన ఎమ్మెల్సీ క‌విత !

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra