• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమరావతి మహిళా రైతులకు జగన్ అవమానం

మహిళా దినోత్సవం రోజు మహిళలపై అరాచకమా?

admin by admin
March 9, 2021
in Andhra, India, Top Stories, Trending
0
amaravati women farmers

amaravati women farmers

0
SHARES
63
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం…ప్రపంచమంతా మహిళల గొప్పతనం గురించి చర్చించుకుంటున్న శుభ దినం…మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ…అంటూ జనం మహిళామణులను కీర్తిస్తున్న తరుణం…అతివలంటే అబలలు కాదు ఆది పరాశక్తులంటూ ప్రశంసిస్తున్న సందర్భం…ఈ రకంగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా పలువురు మహిళలను సన్మానిస్తుంటే…ఇదే రోజున భూమాతను కొలిచే భరతభూమిలో…అందులోనూ మా తెలుగు తల్లికి అంటూ కీర్తించే తెలుగునాట మహిళలకు ఘోర అవమానం జరిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు వరాలు ప్రకటిస్తున్నామని చెబుతోన్న సీఎం జగన్…మరోవైపు అమరావతి మహిళా రైతులను అవమానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలని అమరావతి మహిళా రైతులు సంకల్పించారు. ప్రకాశం బ్యారేజీపై అమరావతి మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఈ విషయం తెలిసిన పోలీసులు తెల్లవారుజామునుంచే తనిఖీలు చేపట్టారు. మహిళా రైతులను అడ్డుకొని మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

దీంతో, సేవ్ అమరావతి అంటూ తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో అమరావతి రైతులంతా నినాదాలు చేస్తూ వందలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు, రాయపూడి నుంచి మందడం వైపు వస్తున్న మహిళలను రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో ….మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతపట్టుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవైపు, రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ అమరావతి రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. బ్యారేజ్ వద్ద తమను పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి ఎక్కడకు తీసుకువెళుతున్నారో అర్థం కాలేదని, కొందరిని మంగళగిరి పీఎస్‌లో 3 గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెం వద్ద వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని వాపోయారు.

447 రోజుల ఉద్యమంపై జగన్ స్పందించలేదని, మహిళ దినోత్సవం రోజు నిరసన తెలుపుతున్న మహిళలకు జగన్ మంచి గౌరవం ఇచ్చారని మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags: AmaravatiandhrapradeshAP CapitalAP PoliceJaganWomenWomensday
Previous Post

మాగంటి రాంజీ మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు

Next Post

NRI: అక్రమవలసే కానీ పన్నులు గట్టిగా కట్టారే

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post
NRI paid taxes to US govt

NRI: అక్రమవలసే కానీ పన్నులు గట్టిగా కట్టారే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra