అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే తన ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించడంపై జోగి రమేష్ మీడియా ఎదుట స్పందించారు. `ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి జోగి రమేష్. కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది బోయి.. మీరు మా మీద కక్షగట్టి, మమ్నల్ని జైలుపాలు చేసి ఆనందం పొందుతారు` అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జోగి రమేష్ కుల ప్రస్థావన తేవడంతో.. ఆనయకు మంత్రి, టీడీపీ సీనియర్ నేత అనగాని సత్యప్రసాద్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. `అయ్యా.. జోగి రమేష్.. మన గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ను అన్యాయంగా మీ ప్రభుత్వ హయాంలో హత్య చేస్తే.. ఆ బిడ్డకు న్యాయం చేయకపోగా.. న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ ఛార్జ్ చేసినప్పుడు కులం గుర్తు రాలేదా? నువ్వు అవినీతి చేసి అడ్డంగా దొరికి.. అరెస్టయితే కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు` అంటూ అనగాని తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టారు. అప్పుడు.. ఇప్పుడు అనే క్యాప్షన్ తో జోగి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ షేర్ చేశారు.
అయ్యా.. జోగి రమేష్!
మన గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ను అన్యాయంగా మీ ప్రభుత్వ హయాంలో హత్య చేస్తే.. ఆ బిడ్డకు న్యాయం చేయకపోగా.. న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై లాఠీ ఛార్జ్ చేసినపుడు కులం గుర్తు రాలేదా?
నువ్వు అవినీతి చేసి అడ్డంగా దొరికి.. అరెస్టయితే కులం అడ్డం పెట్టుకొని… pic.twitter.com/71kaJmKTzd
— Satya Prasad Anagani (@SatyaAnagani) August 13, 2024