ఏపీలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటన చివరి రోజున లోకేష్ న్యూయార్క్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌కు కలిసేందుకు లోకేష్ వెళుతున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అయింది. వందల కొద్దీ వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకపోయాయి. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికా వైఎస్ చైర్మన్ అపాయింట్ మెంట్ లో ఇచ్చిన టైమ్ దాటిపోతోంది. ఆ తర్వాత ఫ్లైట్ కు కూ టైం అవుతోంది.
ఈ క్రమంలోనే లోకేష్ సామాన్యుడిగా మారిపోయి కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. న్యూయార్క్ నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్లిన లోకేష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అంతే కాదు, గతంలో సీఎం చంద్రబాబు కూడా ఇదే మాదిరిగా అమెరికాలో కాలి నడకన వెళ్లిన విషయాన్ని టీడీపీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అమెరికాలో నడుచుకుంటూ వెళ్లిన ఫొటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్న లోకేష్..సామాన్యుడిలాగా నడుచుకుంటూ వెళ్లిన వైనం చర్చనీయాంశమైంది. ఆంధ్రాలోనే కాదు అమెరికాలో కూడా తండ్రి చంద్రబాబు అడుగు జాడల్లో లోకేష్ నడుస్తున్నారని ప్రశంసలు కురుస్తున్నాయి.