మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేశారు. మరాఠాలో మాట్లాడిన పవన్ అక్కడి ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సనాతన ధర్మ రక్షణ కోసమే శివసేన, జనసేన పుట్టాయని పవన్ చెప్పారు. తాను ఓట్ల కోసం రాలేదని, మరాఠా వీరులను గుర్తు చేసుకుందామని వచ్చానని అన్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ పుట్టిన గడ్డపై అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని, జాతీయ భావం, ప్రాంతీయతత్వం జనసేన, శివసేనల సిద్ధాంతమని అన్నారు. బాల్ ఠాక్రే తనకు స్ఫూర్తి అని చెప్పారు.బాలా సాహెబ్ కలగలన్న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ నిర్మించిరని చెప్పారు. విడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా? అని ప్రశ్నించారు. అందరం కలిసి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామని పవన్ పిలుపునిచ్చారు.