ఏపీ రాజధాని అమరావతి మాత్రమే. ఏ రాష్ట్రానికి అయినా ఒకటే రాజధాని ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల వల్ మాత్రమే జమ్ము కాశ్మీర్ కు రెండు రాజధానులు ఉన్నాయి అని హోంశాఖ మంత్రి నిత్యానంద రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు అనుమతి జరుగుతున్న పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో కూడా మంచి స్పందన రావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. ఎలాగైనా అడ్డుకోవాలని మూడు రాజధానుల మద్దతు ర్యాలీలు చేపట్టింది. అంతేగాకుండా పాదయాత్ర చేస్తున్న వారి ఎదురుగా వైసీపీ వారు ప్లకార్డులు పట్టుకుని రావడం చట్ట విరుద్ధం అంటూ టీడీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి నిత్యానంద రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ రాష్ట్రం అయినా ఒకటే రాజధాని ఉంటుంది. ఏపీకి అమరావతే రాజధాని. పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తుంటే నేను డీజీపీతో మాట్లాడతాను అని హోంశాఖ కేంద్రం మంత్రి టీడీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.