ఇబ్బడిముబ్బడిగా చుట్టుముట్టిన కరోనాతో జనం చస్తున్నారు. అసలే ఎండలతో కకావికలం అయ్యే ఢిల్లీ కరోనా దెబ్బకు నరకంలో బతుకుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీలో కరోనాను అదుపు చేయలేక చివరకు లాక్ డౌన్ కూడా పెట్టాయి. దీంతోనే చస్తుంటే కొత్త సమస్య ఇపుడు ఢిల్లీ తలకు చుట్టుకుంది.
డెంగీ కేసులు ఢిల్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఏ సమస్యను పట్టించుకోవాలో దేనిని వదిలేయాలో తెలియని పరిస్థితి.
ఇక మరోవైపు కరోనా చికిత్స ఒక సమస్య అయితే, వ్యాక్సిన్ ప్రోగ్రాం మరో బృహత్తర కార్యక్రమం అయ్యి కూర్చుంది. గతంలో వ్యాక్సిన్ కి స్పందన తక్కువగా ఉంది. వ్యాక్సిన్ పుష్కలంగా దొరికేది. ఇపుడు స్పందన భారీగా ఉంది. వేద్దామంటే వ్యాక్సిన్ లేదు. మొత్తానికి ఇదొక చిక్కుముడిలా ఉంది.
అనేక సంవత్సరాల నుంచి ఢిల్లీని ఏలుతున్న కేజ్రీవాల్ కు ఇంత చిక్కుముడి ఏనాడూ లేదు. అయినా బానే మేనేజ్ చేస్తున్నట్టు లెక్క.