“ఒక దిక్కుమాలినోడు వచ్చి ఏం చేయాలో అంతా చేశాడు“ అని ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించా రు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిపై స్పందించారు. దీనిని ఎవరూ ఎక్కడికి కదల్చలేరన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా దీనిని తీర్చిదిద్దాలని భావించా మని.. కానీ.. ఒక దిక్కుమాలినోడు వచ్చి ఏం చేయాలో అంతా చేశాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. అంతేకాదు.. పాలన కూడా అక్కడే జరుగుతుందని తేల్చి చెప్పారు.
అమరావతి రైతుల త్యాగాలను జగన్ ప్రభుత్వం చులకన చేసిందని చంద్రబాబు అన్నారు. కూల్చి వేతలతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వం కూలి పోవడానికి ముహూర్తం సిద్ధమైందన్నారు. జూన్ 4న జగన్ ప్రభుత్వం కూలిపోతుందని..ఆ రోజు ప్రజా ప్రభుత్వం రానుందని.. అదే రోజున పెద్ద ఎత్తున అమరావతి రైతులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “జూన్ 4న రెండు అద్భుత ఘట్టాలు జరగనున్నాయి. ఒకటి జగనాసుర వధ. రెండు అమరావతి పరిరక్షణకు నాంది“ అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్కడూ లేడని.. బాబుతో పవన్, మోడీ వంటి వారు కూడా ఉన్నారని తెలిపారు.
అమరావతిని పరుగులు పెట్టించడమే ఆలస్యమని చంద్రబాబు అన్నారు. అదేవిధగా విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పా రు. కర్నూలు నగరాన్ని కూడా అభివృద్ది చేస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామ న్నారు. ఐదేళ్లపాటు నరకం చవిచూసిన ప్రజలు కసి తీర్చుకునే రోజు 30 రోజుల్లోనే ఉందన్నారు. ఆ రోజు పోలింగ్ బూతులకు వెల్లువలా తరలి వచ్చి.. కసి తీర్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ను తరిమి కొట్టాలని చెప్పారు. ఒక్క అమరావతి విషయంలోనే కాకుండా.. రాష్ట్రం మొత్తానికీ జగన్ వల్ల నష్టం ఏర్పడిందన్నారు. ప్రజా ప్రబుత్వం రాగానే అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు.
ఇది తాడికొండ కాదు.ఇది అమరావతి. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. అమరావతిని ఎవరూ ఒక ఇంచు కూడా కదల్చలేరు.విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాను. ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా గర్వంగా చెప్పుకునేలా ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని సంకల్పించాను. #PrajaGalam pic.twitter.com/trAQl8dR4J
— N Chandrababu Naidu (@ncbn) April 13, 2024
రాష్ట్ర నడిబొడ్డున నిలబడి చెబుతున్నా.. మన అమరావతిని ఇంచు కూడా కదపలేరు. #PrajaGalam #TDPJSPBJPWinning pic.twitter.com/OhRkmgURHM
— N Chandrababu Naidu (@ncbn) April 13, 2024