• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

దక్షిణాదిన బిజెపి పాగా ఫలించేనా?

admin by admin
September 23, 2023
in Around The World, NRI, Trending
0
0
SHARES
520
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దక్షిణాదిన బిజెపి పాగా వేసేందుకు శత విధాల కృషి చేస్తోంది.గత పదేళ్లుగా దేశాన్ని తిరుగులేని మెజారిటీ తో పాలిస్తున్న బిజెపి కు దక్షిణాది రాష్ట్రాలు కొరకు రాని కొయ్యగా మారాయి. మహారాష్ట్ర,తమిళనాడు, కర్నాటక రాష్ట్రలలో  చేసిన ఆపరేషన్ బిజెపి కార్యక్రమం తాజాగా గత 15 రోజులు గా ఎ.పి.లో చేపట్టింది.

తన చేతికి మట్టి అంటకుండా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చుకు బీజేపీ ఆజ్యం పోస్తోంది. నిజానికి వైసీపీ, టీడీపీలపై బీజేపీకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఏపీలో త్వరలో అధికారం చేపట్టాలన్నదే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లే.బీజేపీ కుటిల పన్నాగం ఇదేనా? ఇలా అయితే ఏపీ బాగుపడినట్లే..!!

కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి మింగుడుపడని ఏకైక అంశం దక్షిణాదిలో బలం లేకపోవడం.

కర్ణాటకలో మినహాయిస్తే మిగతా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం సింగిల్ డిజిట్‌లోనే ఉంటుంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చుకు బీజేపీ ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ లాలూచీ రాజకీయాలు నడుపుతోందని ప్రచారంలో ఉంది.

అటు ఏపీలో కూడా అధికార, ప్రతిపక్షాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు పన్నాగాలు పన్నుతోందని విమర్శలు చెలరేగుతున్నాయి. నిజానికి వైసీపీ, టీడీపీలపై బీజేపీకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఏపీలో త్వరలో అధికారం చేపట్టాలన్నదే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ పునాది కాంగ్రెస్ పార్టీదే. వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్తే ఆ పార్టీ క్యాడర్ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకే చేరుతుందన్నది అక్షర సత్యం. అంతేకాకుండా వైసీపీ డీఎన్ఏ క్రైస్తవ మతంలో ఉంది. అందుకే క్రైస్తవుల్లో ఎక్కువగా ఆ పార్టీనే ఆదరిస్తుంటారు.

మరోవైపు టీడీపీ పునాది పడింది కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ చెల్లాచెదురైతే ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి రాలేరు. ఈ తేడాను గమనించే బీజేపీ ముందుగా టీడీపీని భూస్థాపితం చేయాలని ఆలోచనలు చేస్తోంది. ఆ తర్వాత క్రైస్తవ జవసత్వాలు నిండిన వైసీపీని ప్రజలకు బూచిగా చూపించి ఏపీలో అధికారంలోకి రావాలనే దీర్ఘకాలపు వ్యూహాన్ని అమలు చేస్తోంది.

1982లో తెలుగుదేశం సెంట్రిస్ట్ పార్టీగా పుట్టినప్పటికీ దాని సైద్ధాంతిక పునాదుల్లో వామపక్ష భావజాలముంది. పేదలకు సంక్షేమ పథకాలు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, పటేల్-పట్వారీ వ్యవస్థల రద్దు వంటి పాలనా విధానాలతో, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సాంప్రదాయికంగా కాంగ్రెస్ ఓటర్లైన క్రైస్తవులు, ముస్లింలలో చాలామంది టీడీపీ పక్షమయ్యారు.

మరోవైపు మండల వ్యవస్థ ఏర్పాటు వంటి అధికార వికేంద్రీకరణ చర్యలు, రూల్ ఆఫ్ లా అమలు చేయడం, రాష్ట్రంలో మతకలహాల్ని అణచివేయడం, హైదరాబాద్ నగరాన్ని తెలుగు రాజధానిగా అభివృద్ధి చేయడం, తిరుమల-తిరుపతిని ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలతో మూడు మతాల్లో ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అర్బన్ ఓటర్లు, విద్యావంతులతో పాటు, సామాన్య హిందూ ఓటర్లు టీడీపీకి బలంగా నిలిచారు. అప్పటికి బీజేపీ చాలా చిన్నపార్టీ. ఆ తర్వాత 8 ఏళ్లకు 1990లో అద్వానీ రథయాత్ర కారణంగా బీజేపీ పూర్తిస్థాయి హిందుత్వ పార్టీగా ఎదిగింది.

1995లో చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత గ్లోబలైజేషన్, పీవీ ప్రభుత్వం చేపట్టిన ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన దృష్టిని అభివృద్ధి, సంపద సృష్టి, టెక్నాలజీ, రోడ్లు, రవాణా సదుపాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాల కల్పన, మావోయిస్టు తీవ్రవాదుల అణచివేత వంటి అంశాలపై కేంద్రీకరించారు. ఈ పరిణామాలతో వామపక్షాల నేతలు టీడీపీకి దూరమై రైటిస్టులు దగ్గరయ్యారు. అలా గత 25 ఏళ్లలో టీడీపీ లెఫ్ట్-లీనింగ్-సెంట్రిస్ట్ పార్టీ నుంచి రైట్-లీనింగ్-సెంట్రిస్ట్ పార్టీగా పరిణామం చెందింది.

సాంప్రదాయక కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో నిర్మితమైన వైసీసీని దెబ్బతీసి పరోక్షంగా టీడీపీని బలోపేతం చేయడం కంటే, ఇప్పుడున్న టీడీపీని బలహీనపరచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కనుమరుగు చేయగలగితే దీర్ఘకాలంలో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. అర్జెంటుగా జగన్‌‌ను జైల్లో పెట్టి మూయించేస్తే వైసీపీ సాలిడ్ ఓట్‌బ్యాంక్ అయిన దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లింలు కాంగ్రెస్ గూటికి చేరతారు తప్ప బీజేపీ వైపు రారు.

జగన్‌, వైసీపీకి వచ్చే పొలిటికల్ వ్యాక్యూంలోకి బీజేపీ చొరబడి టీడీపీకి పోటీనిచ్చే ప్రతిపక్షంగా ఎదగలేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగైన కాంగ్రెస్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఈ విషయం బీజేపీకి స్పష్టంగా తెలుసు. అందుకే జగన్‌కు కేంద్ర నిధులతో సాయపడటమో, అతడి అరాచకాల్ని చూసీచూడనట్లు పోవడం, టీడీపీ శ్రేణులపై, నాయకులపై అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు తెరచాటు మద్దతు ఇచ్చి పురిగొల్పడమో చేసి టీడీపీలో రాజకీయ శూన్యత సృష్టించగలిగితే ఆ పార్టీ మద్దతుదార్లు, కార్యకర్తల శ్రేణుల్లో అధిక సంఖ్యలో ఉన్న హిందూ బీసీలు, బీసీయేతర వర్గాలన్నీ బీజేపీలో చేరిపోతాయనేది కమలం పెద్దల అంచనాగా కనిపిస్తోంది. చీమలు పెట్టిన పుట్టని ఆక్రమించుకోవాలనే పెద్దపాము పన్నాగం ఇది. కేవలం ఈ కారణంతోనే జగన్‌ ప్రభుత్వంలో పెరిగిన క్రైస్తవ మతమార్పిడులు, పాస్టర్లకు, ముల్లాలకు ప్రభుత్వ నిధులతో జీతాలివ్వడం, టీటీడీ బోర్డులో క్రైస్తవుల్ని, నాస్తికుల్ని, వివాదాస్పద వ్యక్తుల్ని నియమించడం వంటి సంఘటనలు ఎన్ని జరిగినా బీజేపీ చూస్తూ ఉంటుందే తప్ప విమర్శించలేదు.

నిజానికి బీజేపీ మనుగడకి, దేశవ్యాప్తంగా ఎదుగుదలకు గతంలోనూ, ఇప్పటికీ ఇలాంటివే ఆయుధాలు. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం బీజేపీ ఇవే అంశాలపై మొక్కుబడిగా స్పందిస్తోంది. తమలపాకుతో కొట్టినట్లు జగన్‌ పాలనను విమర్శిస్తోంది అంతే. ఒక్కసారి టీడీపీని బలహీనపరచి, ఆ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగానే బీజేపీ ఇవే అంశాలపై జగన్‌ మీద దాడి చేయనుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏపీలో జగన్ రాజ్యాంగవిరుద్ధ పాలనకు అడ్డుకట్ట వేస్తుందని అనుకోవడం భ్రమే.

నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలది, టీడీపీది ఇద్దరిదీ అస్థిత్వ పోరాటమే. టీడీపీ దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లే. ఇన్నేళ్ళ ఆత్మగౌరవం, స్వయంసమృద్ధి, ప్రజాస్వామిక హక్కులు, రూల్ ఆఫ్ లా పోయి, 1980 లో మనం పత్రికల్లో చదివిన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తరహాలో మధ్యయుగాలకు తరలిపోవడం ఖాయం.తమకు చెప్పులో రాయిగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఈ విధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల‌ ద్వారా వేధింపులకు గురి చేస్తే త్వరలో మన వంతు కూడా వస్తుందని తెలుసుకుంటే మంచిది.

టిడిపి శ్రేణులు కొంతమంది ఆంధ్ర లో  బిజెపి లో చేరాక   ఆంధ్రలో మణిపూర్ తరహాలో కల్లోలం సృష్టించి  ( సంప్రదాయ వైసిపి క్రిస్టియన్ ఓటర్లను చంపడం ద్వారా)  బిసిలను, వెనకబడిన కులాలను అణగతొకైకనున్న బిజెపి.  దానికి వంత పాడుతున్న పవన్ కల్యాణ్.

Tags: aiadmk sasikalaBJPtdp cbn
Previous Post

కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా

Next Post

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

Related Posts

Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Movies

మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!

May 20, 2025
Andhra

మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!

May 19, 2025
NRI

BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!

May 20, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Load More
Next Post

తాడేపల్లి ప్యాలెస్ 'కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్'- బుచ్చిరాం ప్రసాద్!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra