• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

admin by admin
September 23, 2023
in Andhra, Around The World, NRI, Trending
0
0
SHARES
3.8k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఐడీకి అండగా నిలవాలి..రాష్ట్రప్రభుత్వ పరువు ప్రతిష్టలు కాపాడాలనే తటస్థ మేథావినని చెప్పుకునే ఉండవల్లి స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై హైకోర్టులో పిల్ వేశాడు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపారని వైసీపీవాళ్లే చెబుతుంటే, ఎవరికి మేలు చేయడానికి ఉండవల్లి అదే అంశంపై సీబీఐ విచారణ కోరారు?

ఉండవల్లి నిజంగా ప్రజల ఆస్తులకు కాపలా కుక్కే అయితే వాటిని దోచుకుంటున్న దొంగల్నిచూసి అరవాలి గానీ, రక్షణగా ఉన్న ఆవుల్ని ఎందుకు చూసి అరుస్తున్నాడు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్ ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన తప్పుడు కేసుపై తటస్థ మేథావిగా కనిపించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం చూస్తే సీఐడీని, రాష్ట్రప్రభుత్వ పరువుప్రతిష్టలు కాపాడాలన్న ఆయన తాపత్రయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

ఉండవల్లి అరుణ్ కుమార్ నిజంగా తటస్థ మేథావి అయితే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై సీఐడీపెట్టిన అక్రమ కేసుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసేవాడు కాదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని ప్రపంచమంతా నమ్ముతోంది. చంద్ర బాబు నాయుడి అరెస్ట్ తప్పని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లికి టీడీపీ తరుపున కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరగని అవినీతిని జరిగినట్టు చెబుతూ జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియదా? నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోజరుగుతున్న అరాచకాలు..వైసీపీ ప్రభుత్వ అవినీతి ఉండ వల్లికి కనిపించడం లేదా?

జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీ, ఇసుక కుంభకోణంపై న్యాయస్థానాల్ని ఆశ్రయించే దమ్ము, ధైర్యం ఉండవల్లికి ఉన్నాయా?

మద్యం తయారీ, అమ్మకాలద్వారా రాష్ట్రంలో లక్షలకోట్ల అవినీతి జరిగింది. గతంలో ఉండవల్లి కూడా దీనిపై గతంలో అనేకసార్లు మాట్లాడారు. మద్యం కుంభకోణంపై న్యాయస్థానా లను ఆశ్రయించాలని ఉండవల్లికి ఎందుకు అనిపించలేదు?

గతంలో చంద్రబాబునాయడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.70లు కు క్వార్టర్ మద్యం అమ్మితే, దానిపై రూ.7ల ఖర్చుతో తయారయ్యే మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం రూ.70కు అమ్ముతోందన్న ఉండవల్లి నేడు వైసీపీప్రభుత్వం అంతకంటే నాసిరకం మద్యాన్ని రూ.200లకు అమ్ముతుంటే ఎందుకు నోరెత్తడం లేదు? మద్యం తయారీ అమ్మకాలకు సంబంధించిన సాక్ష్యాలు తనవద్ద ఉన్నాయని గతంలోచెప్పిన ఉండవల్లి వాటిని ఆధారంగా చేసుకొని ఏపీలో జరిగే మద్యం స్కామ్ పై సీబీఐ విచారణ కోరుతూ ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదు?

రాష్ట్రంలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలు… వేలకోట్ల అవినీతిపై ఉండవల్లి ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదు? వైసీపీ ఇసుకాసురులపై న్యాయపరమైన చర్య లకు ఉండవల్లి సిద్ధమైతే, ఆయనకు కావాల్సిన పూర్తి సమాచారం టీడీపీనే ఇస్తుంది.

పోలవరం నిర్వాసితుల వెతలు.. స్మార్ట్ మీటర్ల ముసుగులో రైతుల మెడలకు బిగిస్తున్న ఉరితాళ్లు ఉండవల్లికి కనిపించడంలేదా?

జగన్ రెడ్డి రైతు బాంధవుడు అంటున్న ఉండవల్లికి, వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు పెడుతున్న స్మార్ట్ మీటర్లు కనిపించడం లేదా? వాటి నిర్వహణ, కొనుగోళ్ల కు సంబంధించిన టెండర్లలో జరిగిన అవకతవకలు అరుణ్ కుమార్ కు తెలియవా? ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఎందుకు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడంలేదు?

టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలించి, అర్థంపర్థం లేని విమర్శలుచేసిన ఉండవల్లి నేడు ఆ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని, నీళ్లపాలైన నిర్వాసితుల్ని ఎందుకు పరిశీలించడం లేదు? జగన్ రెడ్డిని నమ్మి నిండా మునిగిన నిర్వాసితుల కుటుంబాలకు, రైతులకు న్యాయంచేయడానికి వారితరుపున ఉండవల్లి ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదు?

ఉండవల్లి నిజంగా విజిల్ బ్లోయర్ అయితే రాష్ట్ర ప్రభుత్వ దోపిడీలపై ఎందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించడంలేదు?

ఇవన్నీ గమనిస్తే ఉండవల్లి విజిల్ బ్లోయరా… నిజంగా ప్రజల ఆస్తులకు కాపలా కుక్కా అనే అనుమానం కలుగుతోంది. ఉండవల్లి నిజంగా తటస్థ మేథావే అయితే ప్రజల పక్షా న పనిచేయాలి. కుక్కలు దొంగలు వస్తే మొరుగుతాయి కానీ ప్రజల మధ్యన ఉండే ఆవుల్ని చూసి మొరగవనే వాస్తవం ఉండవల్లి గ్రహించాలి. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులో సీఐడీ ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఉండవల్లి అదే వ్వవహారంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం నిజంగా అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్రంలో జరిగే అనేక దోపిడీలు, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉండవల్లి ఎందుకు చేయడం లేదు? అనేక చిట్ ఫండ్ మోసా లు జరుగుతుంటే ఉండవల్లి కేవలం పనిగట్టుకొని మార్గదర్శి సంస్థనే ఎందుకు లక్ష్యం చేసుకున్నారో కూడా చెప్పాలి.” అని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Tags: buchi ram prasadtadepallis watch dogvundavalli arun kumar
Previous Post

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

Next Post

CBN Arrest-Atlanta, GA Protest

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

CBN Arrest-Atlanta, GA Protest

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra