చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఎందుకో దాని మీద పగబట్టారు వైసీపీ నేతలు. రాజధాని అంటే ఎవరిసొత్తు కాదు. చంద్రబాబు ఎంత అద్భుతంగా కట్టినా… ఎవరు ముఖ్యమంత్రి అయితే వారే దానిపై అధికారం చెలాయిస్తారు. అంతేగాని చంద్రబాబు కట్టినంత మాత్రాన అది ఆయన సొంతం అయిపోదు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధి చెందకూడదు అన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. గత 16 నెలల్లో అమరావతిలో జీరో అభివృద్ధి. ఉన్నవి పోయాయి. పైగా వైజాగ్ కి కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఉన్నది, ఉంచుకున్నది రెండూ పాయె అన్నట్టుంది పరిస్థితి.
ఇక అమరావతిని డీగ్రేడ్ చేయడానికి దానిపై అనేక నిందలు వేశారు. అది మునుగుతుందన్నారు. బాబు కట్టినవి కారుతాయన్నారు. కానీ గతంలో ఎపుడూ రానంత వానలు వచ్చినా అమరావతి మునగలేదు. అసెంబ్లీ కారలేదు. అంటే గతంలో జరిగిందంతా అబద్ధపు ప్రచారమా అన్న అనుమానం వస్తోంది. ఈరోజు 2 గంటలకు పైగా అమరావతిలో భారీ వాన కురిసింది. దానికితోడు కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. కానీ అమరావతిలో ఎక్కడ మునక కనపడలేదు. చక్కగా నీరుచల్లి శుభ్రం చేసిన కొత్తింటిలా కళకళలాడుతోంది. నమ్మలేకపోతే కింద పొటోలు చూడండి.