అమానుషం
ఎంత క్రూరంగా హింసించారో..!అమానవీయంగా చెరపట్టారు..సామూహికంగా అత్యాచారం చేసారు.నాలుక తెగ్గోసిన నరరూప రాక్షసులు.రోజుల తరబడి ప్రత్యక్ష నరకం చూసిన ఆడకూతురు.
దొరికారు కొడుకులు...మేపండి...వాళ్ళను మేపటం తో పాటు వాళ్ళ దగ్గర లంచాలు గుంజుకుని..వాళ్ళు కక్కింది తినండి...!ఆ తల్లిదండ్రులకు అసలే కడుపుకోత...!బిడ్డ పడ్డ వేదన తలుచుకుంటే మనకే మనసు వికలం అవుతుంది.మరి ఆ తల్లిదండ్రుల క్షోభ కు ఉపశమనం ఉన్నదా!?
అత్యాచారం చేసిన వెధవలకంటే..అన్యాయం గా దుర్మార్గంగా.. నీచంగా ప్రవర్తించిన అధికారులనేమనాలి..!!?ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏమనాలి..!?అక్కడ పాలకుడ్ని ఏం చేయాలి..!?కళ్ళు మూసుకున్నారా!?ఏమయ్యారు..ప్రజాసేవకులు..!?అసలు పాలించే అర్హత ఉందా...మీకు!?
ప్రజలకు ...ముక్కపచ్చలారని ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేని...అంతిమసంస్కారం చేసే అవకాశం ఇవ్వని మిమ్మల్ని ఏమనాలి!?కుటుంబాన్ని గదిలో పెట్టి...పోలీసు ..మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని కాల్చేస్తారా!!?ఆ విధులు నిర్వహించిన సిబ్బంది మనిషి జన్మ ఎత్తారా అసలు..!!?
బుద్దిలేని గాడిద ఎవరైనా...అధికార మదంతో ఆదేశాలు ఇచ్చినా తిరస్కరించాలి కదరా!!?మీకు కుటుంబాలు లేవా!!!?మీకు అన్నం ఎలా సహిస్తుందయ్యా!!?ఒక రాష్ట్రం లో తమ పార్టీ పాలిత రాష్ట్రం లో ఇంత దురాగతం జరిగితే కేంద్ర పెద్దలు ఏమి చేస్తున్నారు!!!?
కంగనా కి మాత్రం సెక్యూరిటీ ఇచ్చేస్తారు.ఈగ వాలనివ్వరు.రేపోమాపో ఏదైనా పదవి కూడా ఇవ్వవచ్చు.ఇచ్చుకోండి..కాని ఇలాంటి దారుణాలని చూస్తూ నిర్లక్ష్యం చేయవచ్చా!!?సామాన్యలు మీ కంటికి ఆనరా!!?
నిత్యం...డ్రగ్స్ కేసులో..కంగనా కేసులో...గొంతు చించుకొనే అర్నాబ్ గొంతు పెగలదేం!!?పసిబిడ్డ బతుకు చిద్రమయిపోతే...చివరికి తల్లిదండ్రుల చేత దహనసంస్కారాలు కూడా నోచుకోనంత తప్పు ఆ పిల్ల ఏమి చేసింది!!?
ఈ దేశంలో పేద వారి ఇంట్లో జన్మించటమే ఆమె చేసిన తప్పా!!?అందులోనూ ఆడపిల్లగా పుట్టడమే నేరమా!!!?ఆ పిల్లను పాడుచేసి ...హింసించి హత్యచేసిన వెధవలతో పాటు..ఈ అధికారులను..బాధ్యులైన నాయకులను కఠినంగా శిక్షించాలి.మొత్తం యూపీ అధికార యంత్రాంగము..పాలకులు బాధ్యత వహించాలి.
బ్రిటీష్ ఇండియా లో కూడా ..ఉరి తీయబడిన అమరవీరుల మృత దేహాలని బంధువులకు అప్పగించేవారు.అలాగే కరడు గట్టిన నేరస్దులు ఉరితీయబడితే వారి మృతదేహాలు కుటుంబానికి అప్పగిస్తారు.
జీవించే హక్కు ప్రాధమిక హక్కు గా కలిగిన ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంలో ఏంటి ఈ అరాచకం!!?ఎందుకురా మీ బతుకు...ఆడపిల్లల మీద అత్యాచారాలు అరికట్టలేరు...!కనీసం మరణానంతరం బాధితులకు న్యాయం చెయ్యలేని మీ బతుకూ ఒక బతుకేనా!!?ఇంకా సిగ్గులేకుండా ఎదవ ఉపన్యాసాలు ఇస్తారు!!?దేశాన్ని మేమే ఉద్దరిస్తామంటారు!!?
ఈ దేశానికి దేవుడే దిక్కు...!!
ఓ భారతీయిడి ఆవేదన!!