నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో 10వ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు నేతలు యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఇకపోతే స్వతాహాగా ఫిట్నెస్ ఫ్రీక్ అయిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆసనాలు వేసింది.
అయితే ఈసారి ఒంటరిగా కాకుండా భర్త జాకీ భగ్నానీతో కలిసి రకుల్ ఆక్రోయోగా చేసింది. భార్యభర్తలిద్దరూ చాలా కఠినమైన ఆసనాలను సైతం ఎంతో సులభంగా మరియు బ్యాలెన్సింగ్‌గా ఆసనాలు వేసి మతిపోగొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రకుల్ తన అఫీషియల్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా పంచుకుంది. `అందరం కలిసి ఆరోగ్యంగా మరియు అందంగా ఉందాం. మీ అందరికి అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు` అంటూ పోస్ట్‌లో రాసుకుంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. ఈ కవబుల్ కపుల్ వేసిన ఆసనాలు అభిమానులను మరియు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ ఇంటిది అయింది. బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
గోవాలో వీరిద్దరూ గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఓవైపు ప్రొఫెషన్ ను.. మరోవైపు పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. రకుల్ ఇప్పుడు తమిళంలో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలకు కమిటై ఉంది.