సీనియర్ నటి మీనా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె బిజీబిజీగా ఉన్నారు. గత ఏడాది జూన్ లో భర్త విద్యాసాగర్ ను ఆమె కోల్పోవటం తెలిసిందే. ఈ విషాదం నుంచి బయటకు వచ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. తెలుగు.. తమిళం.. మలయాళ చిత్రాల్ని చేస్తున్న ఆమె.. ఇప్పటికే పలు సినిమాల్ని ఒప్పుకున్నారు.
ఇదిలా ఉంటే.. కొద్ది నెలల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం జోరందుకోవటంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని.. అవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. తన భర్త చనిపోయిన నాటి నుంచి తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతున్నట్లుగా చెప్పారు. బాధలో ఉన్న తనకుఇలాంటి వార్తలు మరింత బాధకు గురి చేస్తాయని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తమిళ నటుడు ఒకరు ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నటి మీనా రెండో పెళ్లి చేసుకోనుందన్న సదరు నటుడు పలు వ్యాఖ్యలు చేశారు. ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి కొడుకు ఎవరో కాదు.. ఏడాది క్రితం విడాకులు తీసుకున్న ప్రముఖ నటుడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని.. నటి మీనా కంటే చిన్న వయస్కుడంటూ పలు హింట్లు ఇచ్చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి.. అందరూ చర్చించుకునే పరిస్థితి. మరేం జరుగుతుందో చూడాలి.