ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తమ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ సైతం ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కాడు. 47 ఏళ్ల వయసులో ఓ ఇంటి వాడు అయ్యాడు. ఎటువంటి హడావుడి లేకుండా గప్ చుప్ గా సుబ్బరాజు వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సుబ్బరాజు అందరితో పంచుకున్నాడు.
అలాగే బీచ్ బ్యాక్ డ్రాప్ లో తన వైఫ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ కనిపిస్తున్న సుబ్బరాజు దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సుబ్బరాజు వివాహం ఎక్కడ జరిగింది? వధువు ఎవరు? అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
కాగా, హైదరాబాద్ లోని డెల్ కంప్యూటర్స్ లో ఉద్యోగం చేసుకునే సుబ్బరాజు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. 2003లో విడుదలైన ఖడ్గం సుబ్బరాజు తొలి చిత్రం. ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ, చంటి ఇలా వరుస చిత్రాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో సుబ్బరాజు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ తోనే తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల జితేందర్ రెడ్డి మూవీతో పలకరించిన సుబ్బరాజు.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. నెగటివ్ రోల్స్ లోనే కాకుండా కమెడీ తరహా పాత్రలు, సహాయక పాత్రలను కూడా చేస్తూ సత్తా చాటుతున్నాడు.
View this post on Instagram